హర్ట్ అయినందుకే సమంత డబ్బింగ్!
టాలీవుడ్ బ్యూటీ సమంత ఇప్పుడు అక్కినేని వారింటి కోడలు కూడా. తమిళ భామ అయిన ఈమె.. ఇప్పుడు తెలుగులో గలగలా మాట్లాడేయడమే కాదు.. డబ్బింగ్ కూడా చెప్పేసుకుంటోంది. రీసెంట్ గా మహానటి చిత్రంలో తన పాత్రకు తనే వాయిస్ ఇచ్చి.. మధురవాణి పాత్రకు మరింతగా వన్నెలు దిద్దింది. ఈ సినిమాలో సమంత డబ్బింగ్ కు మంచి గుర్తింపు కూడా లభించింది.
ఇకపై కూడా ఈ ట్రెండ్ కొనసాగిస్తానంటున్న సామ్.. తెరపై కనిపించడమే కాదు.. వినిపించడమూ తానే అనే ఫీలింగ్ ఆనందం మరింతగా అనుభవించానని.. స్క్రీన్ పై చూసుకున్నపుడు సంపూర్ణమైన ఆనందం పొందానని సామ్ చెబుతోంది. ఆ రోల్ కు ఎలాగూ నత్తి ఉంటుంది కాబట్టి.. తాను కాస్త అటూఇటూగా చెప్పేసినా చెల్లిపోతుందనే ధైర్యంతోనే ప్రయత్నించానని చెబుతోంది సామ్. అయితే.. అసలు కథ వేరే ఉందిట. సమంత ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఆమెకు చిన్మయి డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. సమంత ఇంత స్టార్ డం సంపాదించడానికి.. ఆమెకు ఇంత పేరు రావడానికి చిన్మయి వాయిస్ కూడా సహకరించిందని అంటారు.
ఈ విషయాన్ని గతంలో సమంత కూడా చెప్పేది. కానీ హీరోయిన్లు సొంత డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టాక.. సమంత సక్సెస్ కు చిన్మయి కారణం అనే టాక్ ఎక్కువ కావడంతో.. సామ్ హర్ట్ అయిందట. అందుకే ఇకపై అన్ని సినిమాలకు తనకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఫిక్స్ అయిందట. కానీ ఆప్షన్ మాత్రం దర్శకులదే అంటోంది సమంత.