గ్యారేజ్ కి సమంత స్కిప్.. కావాలనే!?
జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి సమంత హాజరు కాని విషయం తెలిసిందే. సరిగ్గా ఇంకో రెండు గంటల్లో ఫంక్షన్ స్టార్ట్ కానుండగా.. తాను జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ కి రావడం లేదంటూ అభిమానులకు చెప్పింది సమంత. మూవీ టీమ్ కి మరో గంట ముందు మాత్రమే చెప్పినట్లు సమాచారం. ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన సంగతి అయితే నిజమే.
తాను రాలేకపోవడానికి హెల్త్ బాగోకపోవడం అని సమంత కారణం చెప్పింది కానీ.. ఇదేమీ అంత నమ్మదగ్గదిగా లేదు. ఆడియో ఫంక్షన్ జరిగిన మరుసటి రోజే బెంగళూరులోని మారత్ హళ్లిలో బహర్ కేఫ్ ఓపెనింగ్ కి అటెండ్ అయిపోయింది శామ్స్. అంటే హెల్త్ విషయంలో మరీ రాలేనంత పెద్ద సమస్య ఏమీ లేనట్లే. ఈ లెక్కన కావాలనే జనతా గ్యారేజ్ ఫంక్షన్ ని సమంత స్కిప్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. అసలు సమంతది ఇలాంటి పబ్లిసిటీ ఫంక్షన్స్ కు ఎగ్గొట్టే మెంటాలిటీ కాదు.
కానీ జనతా గ్యారేజ్ విషయంలో శామ్స్ చాలానే ఫీలయిందనే టాక్ వినిపిస్తోంది. స్టార్ హీరోకి హీరోయిన్ గా సమంత యాక్ట్ చేసే చివరి సినిమా అనే ప్రచారం జరుగుతున్న టైమ్ లో.. ఇలా ఎగ్గొట్టడం వెనక.. షూటింగ్ టైమ్ లో వచ్చిన డిఫరెన్సులే కారణంగా చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవముందో సమంత చెబితేనే తెలుస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు అది కూడా చెప్పేస్తుంది లెండి.