మంచు హీరో కనిపించుట లేదేమి?

Update: 2015-09-09 17:31 GMT
మంచు మనోజ్‌ ఓ ఇంటివాడయ్యాక చాలా మారిపోయాడు. మునుపటిలా అల్లరల్లరిగా ఎక్కడబడితే అక్కడ తిరిగేయడం లేదు. అల్లరి పనులు పూర్తిగా ఆపేశాడు. అలాగని సినిమాలతో బిజీ అయిపోయాడా? అంటే అదీ లేదు. అన్నయ్య లాగా ప్రొడక్షన్‌ పనులు లేవు. అక్క ప్రసన్న లాగా మీడియా ముందు అటెన్షన్‌ లోనూ లేడు. అసలు మనోజ్‌ ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిపోయాడు? పెళ్లి తర్వాతే ఇలా మారిపోవడానికి కారణమేంటి? మొన్నటి రోజున అన్నయ్య నటించిన డైనమైట్‌ ప్రివ్యూ షోలోనూ ఫ్యామిలీ మొత్తం కనిపించింది కానీ మనోజ్‌ కనిపించనేలేదు .. రీజన్‌ వై?.. ఆరాతీస్తే.. అసలు కారణం తెలిసింది.

పెళ్లికి ముందు మనోజ్‌ రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో ఎటాక్‌ సినిమాలో నటిస్తున్నాడు. పెళ్లయిన తర్వాత మనోజ్‌ కి బైటికి వచ్చేంత తీరికే లేదు. అత్తారింట్లో విందు, వినోదం, అచ్చట, ముచ్చటతోనే కాలం సరిపోయింది. ప్రతి క్షణం ఎంటర్ టైన్ మెంటే  మెంటే. దాంతో ఎటాక్‌ పూర్తి చేయలేకపోయాడు. ఇలా ఎంటర్‌ టైన్‌ అయ్యే క్రమంలో బాగా బరువు పెరిగాడు. పర్సనాలిటీ డబుల్‌ అయ్యింది. ఇప్పుడు ఆ అదనపు బరువును తగ్గించేందుకు మళ్లీ కసరత్తులు ప్రారంభించాడు. పూర్తిగా మళ్లీ మునుపటి షేపులు వచ్చే వరకూ బైట కనిపించకూడదని కండిషన్‌ పెట్టుకున్నాడుట. అందుకే మీడిమా ముందుకు రావడం లేదని చెప్పుకుంటున్నారు. ఏది నిజం ఏది అబద్ధం మంచు హీరోనే తేల్చి చెప్పాలి.
Tags:    

Similar News