రాజమౌళిపై గౌరవమే ఈ హైపంతా

Update: 2015-07-09 04:08 GMT
ఎందుకు రాజమౌళి సినిమా అంటే జనాలకు ఒక స్పెషల్‌ ఎట్రాక్షన్‌? బాహుబలిని ఎక్కువగా మనోడి బ్రాండ్‌ సినిమాగా చూడ్డానికి ముఖ్య కారణం ఏంటి? అసలు ఒక దర్శకుడికి ఈ మధ్యకాలంలో ఈ రేంజులో జనాలు రెడ్‌కార్పెట్‌ వేసిందే లేదు. దాసరి నారయణరావు, కె రాఘవేంద్రరావు సీజన్‌తో ఆ ఎపిసోడ్‌ ముగిసిందని అనుకుంటున్న తరుణంలో.. ఒక డైరక్టర్‌పై జనాల్లో ఆ రేంజ్‌ ఎడ్మిరేషన్‌ మళ్ళీ రాజమౌళి కోసమే కనిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలున్నాయ్‌.

అసలు మగధీర సినిమాను తీసేవరకు రాజమౌళి కేవలం కమర్షియల్‌ సినిమాలను మాత్రమే తీశాడు. అవన్నీ రొటీన్‌ కథలే.. కాకపోతే సరిక్రొత్త టేకింగ్‌ అంతే. అయితే మగధీరలోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ అన్నీ సూపర్‌ హిట్‌ అయ్యేసరికి అటోమ్యాటిక్‌గా మనోడిలో ఊహించని ఓ కథకుడు ఉన్నాడని అర్ధమైంది. అయితే ఆ సినిమాను చేసిన వెంటనే రాజమౌళి బాహుబలి స్టార్ట్‌ చేసుంటే అంతటి క్రేజ్‌ వచ్చేది కాదేమో. నిజానికి అప్పటివరకు రాజమౌళి సినిమాలన్నీ పెద్ద పెద్ద స్టార్లతోనే ఉన్నాయ్‌. పేరున్న హీరోలతోనే తీసుకుంటూ వచ్చాడు. సో, మనోడి ఓన్‌ ట్యాలెంట్‌ను జనాలు గుర్తించాలంటే, ఎవరైనా కొత్త హీరోతో ఓ ప్రయోగం చేయాలి. ఆ టైములో మర్యాదరామన్న తీశాడు. బళా అనిపించుకున్నాడు. ఇక ఆ తరువాత అసలు హీరోయే లేకుండా ఒక స్టోరీ చేద్దాం అని ఫిక్సయ్యి.. వెంటనే ఈగ చేశాడు. అది కేకలు పెట్టించింది. ఆ దెబ్బకి రాజమౌళిపై ఎక్స్‌పెక్టేషన్లు ఓ రేంజులో పెరిగాయి.

అంతేకాదు ఆడియన్స్‌లో ఈగ తరువాత రాజమౌళిపై గౌరవం కూడా పెరిగింది. అందుకే ఈ రోజు బాహుబలి వస్తుందంటే అందరూ పాజిటివ్‌ థింకింగ్‌తో మనోడు ఎటువంటి మైండ్‌ బ్లోయింగ్‌ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ చూపిస్తాడో అని ఆశగా ఎదరుచూస్తున్నారు. ఖచ్చితంగా రాజమౌళి ఏదో ఒకటి కొత్తగానే చూపిస్తాడు అనే ఫీలింగ్‌తో ఉన్నారు. బాహుబలికి ఈ రేంజ్‌ క్రేజ్‌ రావడానికి ఇదే అత్యంత ప్రథమమైన కారణం.

Tags:    

Similar News