నేచురల్ స్టార్ సో స్మార్ట్ అనే అంటున్నారు
ఓటీటీలో బిగ్ రిలీజ్ ఏదీ అంటే.. ఇటీవల `వి` పేరే మార్మోగింది. కానీ ఈ సినిమా సమీక్షలు తీవ్రంగా నిరాశపరిచాయి. డే వన్ క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలే వ్యక్తమయ్యాయి. ఇంద్రగంటి టీమ్ ఎన్నో అంచనాలు పెట్టుకుంటే ప్రివ్యూ షో టైముకే రిజల్ట్ కూడా చెప్పేశారు. ఇక నెక్ట్స్ ఏంటి? నాని ప్రణాళికలు ఎలా ఉన్నాయి? అంటే నేచురల్ స్టార్ సో స్మార్ట్ అనే అంటున్నారు.
`వి` సెట్స్ మీద ఉండగానే నాని రెండు సినిమాలు లైన్ లో పెట్టుకున్నాడు. వాటిలో `టక్ జగదీష్` ఆల్రేడీ లైన్ లో ఉంటే మరొక సినిమా మారుతి డైరెక్షన్ లో ఉండబోతుంది. అయితే `వి` సినిమాకి పెట్టిన రేంజ్ లో ఈ రెండు సినిమాలకి పెట్టుబడులు పెట్టే అవకాశం లేదన్న గుసగుసా వినిపిస్తోంది. వి రిజల్ట్ మాత్రమేనా.. సినిమాలో నాని వేసిన ఆర్మీ ఆఫీసర్ గెటెప్ చాలా కామెడీగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నెక్స్ట్ మూవీ దర్శకనిర్మాతలు నానికి ఉన్న ప్లస్ పాయింట్స్ తోనే సినిమాలు తియ్యాలని ఫిక్సయ్యారట. అంతేకానీ కొత్తదనం ట్రై చేయడం అన్నిసార్లు సరికాదని భావిస్తున్నారట. తాజా చిత్రంలో ప్రయోగం ఆశించిన రిజల్టుని ఇవ్వకపోవడంతో ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని నాని తో పని చేసే దర్శకనిర్మాతలు ఆశిస్తున్నారట. ఇక నటుడిగా ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడే నాని ఈసారి చాలా కేర్ తీసుకుంటారన్న చర్చా సాగుతోంది.