• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రవితేజ 100 కోట్ల...

రవితేజ 100 కోట్ల ఎఫెక్ట్.. ఈసారి మిరపకాయ్

By - Tupaki Desk
Update: 2023-01-18 14:05 GMT
వరుసగా సినిమాల రీ రిలీజ్‌లను ప్రకటిస్తూ వస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే అనేక సినిమాలు రీ రిలీజ్ చేయడానికి షెడ్యూల్ అవ్వగా.. ఇప్పుడు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది రవితేజ హీరోగా నటించిన మిరపకాయ్ సినిమా. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిరపకాయ్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ సినిమాలో దీక్ష హీరోయిన్‌గా నటించింది.

జనవరి 12వ తేదీ 2011వ సంవత్సరంలో సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా అప్పట్లో మిగతా అన్ని సినిమాలతో పోటీపడి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. రవితేజ సరసున రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్‌ నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించారు. నాగబాబు, అజయ్, బ్రహ్మాజీ, రావు రమేష్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారు ఇతర కీలకపాత్రలో నటించారు. అప్పట్లో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాదు.. మంచి వసూళ్లను కూడా రాబట్టింది. అప్పట్లో 114 కేంద్రాల్లో 50 రోజులపాటు విజయవంతంగా నడిచిన ఈ సినిమాని జనవరి 26వ తేదీన రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

ఆ రోజున రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా మిరపకాయ్ సినిమాను మళ్లీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ మీద రమేష్ పుప్పాల నిర్మించారు. అయితే ఇలా రవితేజ సినిమాని రీ రిలీజ్ చేయడం వెనుక కారణం  ధమాకా సూపర్ హిట్ కావడమే అని తెలుస్తోంది. డిసెంబర్ ఆఖరిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించడమే కాకుండా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

సంక్రాంతి సీజన్‌లో రెండు భారీ తెలుగు సినిమాలు రెండు తమిళనాడు డబ్బింగ్ సినిమాలు ఒక చిన్న సినిమా బరిలో ఉన్నా సరే ఈ సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టింది.  థియేటర్లన్నింటిలో హౌస్ ఫుల్ అవుతూ నిర్మాతలకు షాక్ కలిగిస్తోంది. రవితేజ మిరపకాయ సినిమాని మరోసారి తెరమీదకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వాల్తేరు వీరయ్య సినిమా విషయంలో కూడా రవితేజ పాత్ర చాలా ఉందని విజయంలో ఆయన కూడా తన వంతు పాత్ర పోషించాడని భావిస్తున్నారు. మరి చూడాలి ఈ మిరపకాయ రీ రిలీజ్ రవితేజకి ఎలా కలిసి వస్తుందనేది. 

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Raviteja 
  • mirapakay 
  • movie 
  • rerelease 
  • theaters 
  • latestnews 

Similar News

బయట 100 కెమెరాలు..లోపల వైట్ సోఫా రూల్!

2026-11-12 11:30 GMT

ఘనంగా మహేష్ బాబు మేనల్లుడి ప్రీ వెడ్డింగ్.. స్పెషల్ పోస్ట్ పంచుకున్న నమృత!

2026-11-12 11:00 GMT

‘వారణాసి’కి రామాయణం చేస్తున్న సాయం

2026-11-12 10:38 GMT

మామ్ గిల్ట్ అంటే ఏంటో అప్పుడే తెలిసింది!

2026-11-12 10:30 GMT

200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆభరణాలు.. కరీనాకపూర్ కు వారసత్వంగా ఇంకేం లభించాయంటే?

2026-11-12 10:05 GMT

'వారణాసి'.. ఏడాదిగా ఒక్కటేనా..

2026-11-12 09:54 GMT

ఇన్‌ఫ్లుయెన్సర్స్ నిజంగా ఆ రేంజ్ లో సంపాదిస్తున్నారా?

2026-11-12 09:45 GMT

నువ్వే నువ్వే నుంచి ఆదర్శ కుటుంబం వరకు.. త్రివిక్రమ్‌లో ఈ మార్పేంటి?

2026-11-12 08:18 GMT

తండ్రి కట్ చేసిన సీన్‌ను దొంగచాటుగా కలిపిన హృతిక్!

2026-11-12 08:17 GMT

సూర్యతో నాకు పోలికేంటి? ఆయన లెజెండ్!

2026-11-12 08:16 GMT

వారి గురించి ఆలోచించడం సోనూ సూద్‌ గొప్పతనం..!

2026-11-12 08:16 GMT

'ఇడుపు కాయితం' టీజర్.. సీతా కళ్యాణంతో మొదలై విడాకుల దాకా..

2026-11-12 06:57 GMT

Copyright @2026

Powered by Blink CMS