సత్తా ఉన్న మగాడి కోసం!!!

Update: 2015-07-27 15:26 GMT

Full View
మాస్‌ మహారాజ్‌ విక్రమార్కుడుగా నటిస్తే జేజేలు పలికాం. అందులో పోలీసోడి సత్తా అంటే ఎలా ఉండాలో చూశాం. అలాగే పవర్‌ సినిమాలో లాఠీ పట్టి తిప్పేస్తుంటే రియల్‌ పోలీస్‌ ఇలానే ఉంటాడా? అనుకున్నాం. ఇప్పుడు అదే పోలీస్‌ క్యారెక్టర్‌ బుల్లితెరపైనా కనిపిస్తోంది. అయితే అది ఓ వాణిజ్య ప్రకటన కోసం చేసిన ఫీట్‌.

ఓ ఇద్దరు ఇన్‌ ఫ్లూయెన్స్‌ ఉన్న దొరబాబులు తప్పు చేసి కటకటాల వెనక్కి వస్తే ఎలా ఉంటుంది? అందులో మామూలు పోలీసుల దగ్గర ఎలాంటి జులుం చూపిస్తారు. అదే చూపించారు ఈ యాడ్‌లో. అయితే అప్పుడు దిగుతాడు లెండి సత్తా ఉన్న మారాజా. స్పీడ్‌ గా వచ్చి వెళ్లిపోవడానికి మీరేమైనా సంక్రాంతి అల్లుళ్లనుకున్నారేంట్రా? స్పీడ్‌ గా వెళ్లేప్పుడు కట్‌ కొట్టి వెనక్కి ఎలా వెళ్లాలో తెలియాలి గదరా.. అంటూ మాస్‌ మహారాజ్‌ విసిరిన పంచ్‌ విజిల్స్‌ కొట్టించేలా ఉంది.

లార్డ్‌ అండ్‌ మాష్టర్‌ బ్రాండ్‌ రవితేజని రంగంలోకి దించింది. మాస్‌ రాజా లాఠీ విసిరితే చాలు అది వచ్చి మొహం పగలగొడుతుంది. అంతేనా అసలు పవర్‌ఫుల్‌ పోలీస్‌కి పర్యాయపదంలా కనిపించాడు రాజా. యాడ్‌ అదిరిపోయింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా ఉందీ ప్రకటన.
Tags:    

Similar News