ప్రేక్షకులు వైలెన్స్ కోరుతున్నారనే..?

సిల్వర్ స్క్రీన్ పై యాక్షన్ సీన్స్ కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒకప్పుడు ఫైట్స్ యాక్షన్స్ సీన్స్ ని ఒకలాగా డిజైన్ చేస్తూ వచ్చారు.;

Update: 2025-12-25 06:09 GMT

సిల్వర్ స్క్రీన్ పై యాక్షన్ సీన్స్ కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఒకప్పుడు ఫైట్స్ యాక్షన్స్ సీన్స్ ని ఒకలాగా డిజైన్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు వైలెన్స్ ఎక్కువ కావాలని ఆడియన్స్ కోరడంతో సినిమాల్లో రక్తపాతాన్ని చూపిస్తున్నారు. బ్లడ్ బాత్ సీన్స్ తో తెరంతా రక్తపు మడుగులతో నిండిపోతుంది. కథకు తగిన వైలెన్స్ అవసరం అనిపిస్తే చాలు దాన్ని నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

బ్లడ్ బాత్ సీన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే..

ఐతే ఇవి అందరికీ నచ్చుతాయా అంటే సెన్సిటివ్ పీపుల్ ఏమో కానీ మాస్ ఆడియన్స్ మారం ఇలాంటి బ్లడ్ బాత్ సీన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ సినిమాల్లో ఇలాంటి నరుకుడు సీన్స్, రక్తం ఏరులై పారితే చాలు ఫ్యాన్స్ కి అదో ఫీస్ట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అఫ్కోర్స్ అది రియల్ కాదనే ఒక ఫీలింగ్ లోపల ఉంటుందనుకోండి.

ఐతే ఆడియన్స్ చూసేస్తున్నారు కదా అని మేకర్స్ కూడా ఈ బ్లడ్ బాత్ సీన్స్ లో ఇంకాస్త ముందుకెళ్తున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమా టీజర్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఆ ఎమోషన్ ని చూపిస్తూ బూతులతో రౌడీ జనార్ధన టీజర్ తో చేసిన బీభత్సం చూసి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారు.

ఫైర్ కావాలి కాబట్టే దర్శకులు అలా..

ఇక లేటెస్ట్ గా మైసా అంటూ రష్మిక కూడా మరో మాస్ పాత్రలో షాక్ ఇవ్వబోతుంది. చేతికి సంకెళ్లు.. తుపాకీతో ఆమె శత్రువులపై ఎదురుదాడికి దిగిన మైసా టీజర్ కూడా ఇంప్రెస్ చేసింది. సినిమాకు ఆ ఎమోషన్, ఆ ఫైర్ కావాలి కాబట్టే దర్శకులు అలా ఫిక్స్ చేస్తున్నారు. ఇదే వరుసలో స్టార్ సినిమాలతో పాటు మీడియం రేంజ్ హీరోలు కూడా మాస్ సినిమాలతో బ్లడ్ బాత్ సీన్స్ తో హంగామా చేస్తున్నారు.

ఓ విధంగా ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టే మళ్లీ మళ్లీ ఇలాంటి అటెంప్ట్ లు దర్శక నిర్మాతలు చేస్తున్నారని చెప్పొచ్చు. సినిమా అంటేనే లార్జర్ దాన్ లైఫ్ అనిపించేలా కథ, కథనాలు ఉంటాయి. ఈమధ్య హీరో క్యారెక్టరైజేషన్స్ లో టిపికల్ టైప్ లను తీసుకుంటూ ఆ హీరో చేసే మాస్ విధ్వంసానికి ఆడియన్స్ అదుర్స్ అనేలా చేస్తున్నారు.

సో తెర మీద బ్లడ్ బాత్ అది ఆడియన్స్ ఆమోదం పొందేంత వరకు పర్వాలేదు ఐతే మితిమీరిన వైలెన్స్ అనవసరం అనిపిస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ సినిమా మీద కూడా పడుతుంది. ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేంత వరకు ఎలాంటి విధ్వంసాలు అయినా పర్వాలేదు కానీ అది ఒకసారి శృతిమించితే మాత్రం ఆ ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది. సో తెర మీద ఎంత బ్లడ్ బాత్ చూపించినా హీరో ఎమోషన్ కి ఆడియన్స్ ఎంగేజ్ అయితేనే ఆ సందర్భంలో అతను అలా చేయడం కరెక్ట్ అని వాళ్లు కన్విన్స్ అవుతారు. అలా కాదంటే మాత్రం రివర్స్ లో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Tags:    

Similar News