• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `100 క్రోర్స్` స్కామ్ లో...

`100 క్రోర్స్` స్కామ్ లో రావిపూడి క‌నెక్ష‌న్?

By - Tupaki Desk
Update: 2021-06-27 12:16 GMT
రూ.500 నోట్లు.. రూ.1000 నోట్లను ర‌ద్దు చేసిన స‌మ‌యంలో దేశంలో బ్లాక్ మ‌నీ ఎటు పోయింది? అనే వ్య‌వ‌హారంపై ప్ర‌జ‌ల‌కు పూర్తిగా అవ‌గాహ‌న లేదు. వంద‌ల కోట్ల ప‌చ్చ నోట్ల‌ను త‌గ‌ల‌బెట్టిన బ‌డాబాబులున్నారు. ప‌నామా మార్గాల్లో విదేశాల‌కు డ‌బ్బు త‌ర‌లి వెళ్లిపోయింది. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత తిరిగి 200 నోటు.. 2000 నోటును ప్ర‌వేశ పెట్టిన వైనం తెలిసిందే. అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ పై సినిమా తీస్తే అది అంద‌రిలో ఉత్కంఠ పెంచుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ త‌ర‌హా థ్రిల్ల‌ర్ జానర్ మూవీనే- 100 క్రోర్స్. రాహుల్ టైసన్.. చేతన్.. ఎమీ.. ఐశ్వర్య నాయ‌కానాయిక‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను నూతన దర్శకుడు విరాట్ చక్రవర్తి డైరెక్ట్ చేస్తున్నారు.. శ్రీమతి దివిజా సమర్పణలో యస్.యస్ స్టూడియోస్ - విజన్ సినిమాస్ బ్యానర్స్ లో సాయి కార్తీక్- నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ దీపాల సహా నిర్మాత. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా విడుదల చేశారు. టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తించింద‌ని ఆయన ప్ర‌శంసించారు.

2016 నవంబర్ 8న 500 నోట్లు.. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ఈ అనౌన్స్ మెంట్ వచ్చిన రోజు రాత్రి ఊరి చివర పెద్ద ఎత్తున డబ్బు తగలబెట్టిన ఘటన... అది బ్లాక్ మనీ అయ్యి ఉంటుందనే సందేహం...``మీకు రావాల్సిన అమౌంట్ మొత్తం ఆర్బీఐ ద్వారా బెంగళూరు నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గం ద్వారా రావాలి రైట్`` అనే వాయిస్ వినిపిస్తుంది. హై సెక్యూరిటీ కాపలా ఉండే ఈ భారీ మొత్తం డబ్బును ఎవరు కొట్టేశారు ?.. ఎక్కడ దాచారు ?.. ఆ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలేంటి ? అనేది సినిమా మీద క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.

సంగీత దర్శకుడు సాయి కార్తీక్ నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా ఇది. నిర్మాణానంత‌ర ప‌నులు పూర్త‌య్యాయి. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సాక్షి చౌదరి- ఐశ్వర్య- సమీర్- శరత్ లోహితీశ్వర్- భద్రం- ఇంటూరి వాసు- షేకింగ్ శేషు- అన్నపూర్ణమ్మ తదితరులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. చరణ్ మాధవనేని ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీ అందించారు.




Full View

Tags:    
  • 100 Crores Movie Teaser 
  • 100 Crores Movie Teaser talk 
  • 100 Crores Movie 
  • Anil Ravipudi 

Similar News

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

Copyright @2026

Powered by Blink CMS