ఒక్కసారి వచ్చేయాల్సింది రవితేజ

Update: 2017-06-26 07:29 GMT
ఇప్పుడు అంతా ఒకటే చర్చ. అసలు తన తమ్ముడు భరత్ అంత్యక్రియలకు భూపతిరాజు రవితేజ ఎలియాస్  మాస్ రాజా ఎందుకు రాలేదనే. పైగా హస్పిటల్ మార్చురీ నుండి పోస్టు మార్టమ్ పూర్తయ్యాక భరత్ బాడీని నేరుగా జూబ్లీ హిల్స్ ఖనన వాటికకు తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించడం.. అక్కడ రవితేజ లేకపోవడం.. ఇప్పుడు చాలా రూమర్లకు తావిచ్చింది.

నిజానికి భరత్ కు అంత్యక్రియులు నిర్వహించింది రవితేజ తండ్రే. ఆ విషయం చాలామందికి అర్ధమవ్వలేదు. అదే విధంగా మొత్తం కార్యక్రమాన్ని రవితేజ మరో సోదరుడు రఘు దగ్గరుండి పర్యవేక్షించారు. ఇకపోతే ఇక్కడ తెలుస్తున్న ఒక విషయం ఏంటంటే.. రవితేజకు భరత్ అంటే చాలా ఇష్టమట. అందుకే అతను చాలా ఎమోనల్ అయిపోయాడని తెలుస్తోంది. మనిషి చనిపోతే ఎప్పుడైనా కూడా తోబుట్టువులూ బంధువులూ నిర్ధాంతపోయి నివ్వెరపోతారు. అదే విధంగా రవితేజ కూడా చాలా అప్సెట్ అయిపోయి.. చివరకు బ్రేక్ డౌన్ అయిపోయాడట.

ఇప్పుడు ఖనన వాటికలో భరత్ భౌతిక ఖాయాన్ని చూస్తే ఇంకా కన్నీరు మున్నీరు అయిపోయే పరిస్థితి ఉంటుంది. పైగా ఇది నార్మల్ డెత్ కాదు.. యాక్సిడెంట్లో భరత్ ముఖం చిద్రమైంది. రక్తసముద్రంలో తన తమ్ముడి బాడీ చూసే ధైర్యం చేయలేక రవితేజ అక్కడికి రాలేదట. కాని ఆయన ఒక్కసారి వచ్చి తమ్ముడ్ని కడ చూపు చూసుంటే బాగుండేదని అభిమానుల ఫీలింగ్. ఏదేమైనా కూడా భరత్ ఆత్మకు శాంతిచేకూరాలని.. అలాగే రవితేజ కుటుంభం కూడా ఈ మనోవ్యథ నుండి త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.

నోట్ః అతివేగం.. ప్రాణాలు తీస్తుంది. వేగం కారణంగా.. సీట్ బెల్టులు పెట్టుకోకపోవడం వలన.. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన.. ఎంతటి లగ్జరీ కార్లైనా.. కోట్లు పోసి కొన్న వెహికల్స్ అయినా.. వేగం ముందు తలొంచి మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి రీడర్స్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News