మోడీ బయోపిక్... రవికిషన్ సాహసం

Update: 2019-09-10 08:58 GMT
రేసు గుర్రం సినిమాలో హీరో అల్లు అర్జున్ తో పోటీపడి విలన్ గా అద్భుతంగా  నటించి మంచి మార్కులు తెచ్చుకున్నారు భోజ్ పురి నటుడు రవికిషన్. ఇక మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా గోరఖ్ పూర్ నుంచి బీజేపీ ఎంపీగా పోటీచేసి గెలిచారాయన.. తనన ఎంపీని చేసిన మోడీ రుణం తీర్చుకునేందుకు ఇప్పుడు సాహసమే చేస్తున్నారు.

ఇప్పటికే ఎన్నికల వేళ.. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ‘పీఎం నరేంద్రమోడీ’ పేరుతో ఓ బయోపిక్ ను తెరకెక్కించాడు. అయితే దానికి భిన్నంగా తన భోజ్ పురి భాషలో మోడీ బయోపిక్ ను తెరకెక్కిస్తానని తాజాగా నటుడు, ఎంపీ రవికిషన్ తెలిపారు.  

ఈ సందర్భంగా తాను మోడీ బయోపిక్ తీయడానికి గల కారణాలను రవికిషన్ మీడియాకు తెలిపారు. తాను పుట్టిన బీహార్ లోని గ్రామంలో కనీసం టాయ్ లెట్ లు కూడా లేవు. మా అమ్మ తో సహా చాలా మందికి దీనివల్ల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయన్నారు. మోడీ స్వచ్ఛభారత్ తో తమ గ్రామ సమస్యలు తీరాయని చెప్పుకొచ్చాడు. ఇక చైనాను నియంత్రించి పాకిస్తాన్ ను అడ్డుక్కుతినేలా చేసిన ఘనత మోడీషాలదే.. వీరి డైనమిక్ లీడర్ షిప్ చూస్తే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కూడా మనకే వస్తుందని అనిపిస్తోంది అని రవికిషన్ తెలిపారు. అందుకే మోడీ బయోపిక్ ను తాను భోజ్ పురి భాషలో తీసేందుకు నిర్ణయించానని తెలిపారు.  ఒక నటుడిగా మోడీ జీవితాన్ని వెండితెరపై నిజాయితీగా తీసుకురావాలని అనుకుంటున్నారు.


Tags:    

Similar News