బాలీవుడ్ సూప‌ర్ స్టార్ .. ఇదేనా ర‌ష్మిక‌ టార్గెట్?

Update: 2022-03-31 15:30 GMT
బాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వాల‌ని క‌ల‌లుగంటారు చాలామంది న‌వ‌త‌రం న‌టీన‌టులు. కానీ అదేమీ అంత సులువేమీ కాదు. అంచెలంచెలుగా ఎద‌గాల్సి ఉంటుంది. న‌ట‌వార‌సుల‌తో పోలిస్తే ఔట్ సైడ‌ర్స్ కి అవ‌కాశాలు దొర‌క‌డం అంత సులువేమీ కాదు. సుదీర్ఘ కాలం కెరీర్ ని సాగించాలంటే కంగ‌న‌లాగా అయినా గ‌ట్స్ ఉండాలి.

కానీ ఇవేవీ లేకుండానే చూస్తుండ‌గానే బాలీవుడ్ లో చ‌క‌చ‌కా అడుగులు వేస్తోంది ర‌ష్మిక మంద‌న‌. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల్ని త‌న ఖాతాలో వేసుకుంది. నాలుగు సినిమాలు అధికారికం కాగా రెండిటినీ పూర్తి చేసేస్తోంది. ర‌ష్మిక స్పీడ్ చూస్తుంటే బాలీవుడ్ లో పెద్ద స్టార్ అవ్వాల‌నుకుంటోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

సూప‌ర్ స్టార్ గా స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతోంది. నేష‌న‌ల్ క్ర‌ష్ గా ఇప్ప‌టికే క్రేజ్ ఉంది. పుష్ప లాంటి పాన్ ఇండియా చిత్రంతో త‌న రేంజు అమాంతం మారిపోయింది. సౌత్ నుంచి నార్త్ కి వెళ్లిన చాలామంది నాయిక‌ల్లో ర‌ష్మిక ల‌క్కీయెస్ట్ అనే చెప్పాలి. ఇలియానా - త్రిష - కాజ‌ల్ లాంటి భామ‌ల‌కు ధీటుగా ర‌ష్మిక అడుగులు క‌నిపిస్తున్నాయి. ఒక‌ట్రెండు హిట్లు ప‌డితే త‌న రేంజు ఇంకా పెద్ద‌ద‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఏది ఏమైనా ర‌ష్మిక ప్లానింగ్ చూస్తుంటే నెక్ట్స్ జెన్ బాలీవుడ్ సూప‌ర్ స్టార్ గా ఎదిగేసే ప్లాన్ లో ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఒక్కో స్టెప్ క్రేజీగా టాప్ హీరోల‌తో..!

ఇప్ప‌టికే అమితాబ్ సినిమాలో న‌టించేస్తోంది. అలాగే సిద్ధార్థ్ మ‌ల్హోత్రా లాంటి ఎన‌ర్జిటిక్ హీరోతో చేస్తోంది. ఇటీవ‌ల ర‌ణ‌బీర్ క‌పూర్ లాంటి అగ్ర హీరో స‌రస‌న అవ‌కాశం ద‌క్కించుకుంది. రణబీర్ కపూర్ న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `యానిమల్` ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ప‌రిణీతి స్థానంలో ఛాన్స్ కొట్టేసింది.  

బాలీవుడ్ మీడియా నివేదిక ప్రకారం.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని టాక్ వినిపించింది. ఇటీవల పరిణీతి చోప్రా ఈ మూవీ నుంచి త‌ప్పుకుంద‌న్న ప్ర‌చారం న‌డుమ ఈ వార్త  ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇంతియాజ్ అలీ `చమ్కిలా` కోసం కాల్షీట్ల‌ను కేటాయించిన ప‌రిణీతికి డేట్ ఇష్యూ వ‌చ్చింద‌ని క‌థ‌నాలు గుప్పుమ‌న్నాయి. అందుకే యానిమ‌ల్ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకుంది.

1 జనవరి 2021న సోషల్ మీడియాలో యానిమ‌ల్ చిత్రాన్ని ప్రకటించింది చిత్ర‌బృందం. తండ్రి కొడుకుల మ‌ధ్య ఎమోష‌న‌ల్ డ్రామా నేప‌థ్యంలో సినిమా ఇది. క్రైమ్ డ్రామా క‌థాంశంలో రణబీర్ కపూర్ క‌థానాయ‌కుడు. అత‌డు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.

ఈ చిత్రంలో రష్మిక మందన్న అతని భార్య పాత్రను పోషిస్తుంది. ప్రాజెక్ట్ కి సన్నిహిత వ్య‌క్తుల క‌థ‌నాల ప్ర‌కారం..భూషణ్ కుమార్ - సందీప్ రెడ్డి వంగా బృందం క‌న్న‌డ న‌టి రష్మిక ఈ పాత్ర‌కు సరిపోతారని భావించారు. ర‌ణ‌బీర్ స‌ర‌స‌న పాత తార‌ల్ని కాకుండా కొత్త తారాగణాన్ని కోరుకున్నారు. రష్మిక యానిమల్ లో ర‌ణ‌బీర్ తో కెమిస్ట్రీ పండించ‌నుంది. ఇద్దరూ ఈ చిత్రంలో ర‌క్తి క‌ట్టించే న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటార‌ని భావిస్తున్నారు.

రణబీర్ కపూర్ యానిమల్ లో డార్క్ షేడ్ ఉన్న పాత్ర‌లో ఎమోష‌న‌ల్ గా క‌నిపిస్తాడు. ఇంత‌కుముంద యానిమ‌ల్ ప్రకటన వీడియోలో.. తన తండ్రితో తన పాత్ర సమస్యాత్మక సంబంధం గురించి రివీల్ చేశాడు. అదే సందర్భంలో రణబీర్ ఏమ‌న్నాడంటే.. పాపా అగ్లే జనమ్ మే ఆప్ మేరా బేటా బన్నా.

ఫిర్ దేఖ్నా మెయిన్ ఆప్కో కైసే ప్యార్ కర్తా హున్ ఔర్ సిఖ్నా ఆప్. క్యుంకీ ఉస్కే అగ్లే జనమ్ మే వాపిస్ మెయిన్ బేటా ఔర్ ఆప్ పాపా. తబ్ నా పాపా,.. అప్నీ తారా సే ప్యార్ కర్నా,.. మేరీ తరహ్ సే నహీ. ఆప్ సమాజ్ రహే హో నా పాపా? బాస్ ఆప్ సమాజ్ లో తో కాఫీ హై.. అంటూ డైలాగ్ చెప్పాడు. ఆ వీడియో తుపాకీ కాల్పులతో ముగుస్తుంది. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్- ప్రణయ్ రెడ్డి వంగా- క్రిషన్ కుమార్ - మురాద్ ఖేతాని నిర్మిస్తున్నారు. చిత్ర తారాగణంలో అనిల్ కపూర్ - బాబీ డియోల్ కూడా ఉన్నారు.
Tags:    

Similar News