రష్మిక మడోనా.. ప్రమోషన్ వచ్చిందిగా!
అమెజాన్ OTTలో అల్లు అర్జున్ `పుష్ప- ది రైజ్` ని విడుదల చేయడంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే థియేట్రికల్ రిలీజ్ ద్వారా 350 కోట్ల వరకూ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన ఈ చిత్రం ఓటీటీలోనూ విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ఇక ఈ మూవీ నుంచి క్లిప్పింగులు కూడా అంతే హాట్ టాపిక్ గా మారుతున్నాయి. నిరంతరం సోషల్ మీడియాల్లో సమంత `ఊ అంటావా...` సాంగ్ తో పాటు.. అల్లు అర్జున్ యాక్షన్ ఎపిసోడ్స్ .. రష్మికతో ఘాటైన రొమాన్స్ కి సంబంధించిన క్లిప్పింగులు వైరల్ అవుతున్నాయి.
రష్మిక మందన్న లిప్ కిస్ సీన్.. బన్నీ ఆటోలో చెయ్యి వేసే ఎపిసోడ్.. వగైరా వగైరా విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సామీ నా సామీ పాటలో రష్మిక అందాల ఎలివేషన్ సహా గ్లామర్ షోస్ మాస్ కి ఫుల్ గా కిక్కిచ్చిన సంగతి తెలిసిందే. కారణం ఏదైనా ఓటీటీ రిలీజ్ అనంతరం రకరకాల చిత్రాలు బయటపడ్డాయి. ఈ మూవీ ఓటీటీ అనువాదంలో కొన్ని తప్పులు దొర్లాయి. మూవీ ఎండ్ టైటిల్ క్రెడిట్స్ లో రష్మిక పేరును చూసి జనం షాక్ కి గురవుతున్నారు. స్పష్టంగా ఆమె పేరు ముగింపు శీర్షికలలో `రష్మిక మడోనా` అని ముద్రించి ఉంది. ఇది వీక్షకులను ఆశ్చర్యపరిచింది.
రష్మిక మందనకు నేషనల్ క్రష్ గా గుర్తింపు ఉన్నంత మాత్రాన అప్పుడే మడోన్నాగా ప్రమోటైపోయిందా? అంటూ యూత్ కామెంట్లు గుప్పిస్తున్నారు. పాప్ స్టార్ మడోనా క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తన పేరును ఎవరు తప్పుగా రాసినా కానీ స్పెల్లింగ్ మిస్టేక్ హైలైట్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్‌కు దారి తీస్తుంది. అయితే ఇలాంటి విషయాల్ని నిర్మాతలు కానీ అమెజాన్ వారు కానీ జాగ్రత్త తీసుకుని ఉంటే బావుండేదని రష్మిక అభిమానులు అంటున్నారు.