శివ కార్తికేయన్ - అనుదీప్ మూవీలో రష్మిక..?

Update: 2021-07-27 23:30 GMT
'ఛలో' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన రష్మిక మందన్నా.. వరుస ఆఫర్స్ తో ఛలో మంటూ దూసుకుపోతోంది. ఆ త‌రువాత వచ్చిన 'గీత గోవిందం' సినిమాలో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. 'డియ‌ర్ కామ్రేడ్' - 'దేవదాస్' సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే ఛాన్స్ దక్కించుకుని.. 'స‌రిలేరు నీకెవ్వ‌రు' వంటి బ్లాక్ బస్టర్ రుచి చూసింది. ఇదే జోష్ లో 'భీష్మ' సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకుని లక్కీ బ్యూటీగా మారిపోయింది.

రష్మిక మందన్నా చేతిలో ప్రస్తుతం అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'పుష్ప' చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ ఏడాది చివర్లో 'పుష్ప 1' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండో పార్ట్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. అలానే శర్వానంద్ - డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో అమ్మడు పాల్గొంటోంది.

బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ.. ఆల్రెడీ రెండు హిందీ సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా తో కలిసి 'మిషన్‌ మజ్ను' మూవీలో నటిస్తోంది రష్మిక. స్పై థ్రిల్లర్‌ కథాంశంతో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న 'గుడ్‌ బై' సినిమాలో రష్మిక కీలక పాత్ర పోషిస్తోంది. ఇదే క్రమంలో ఇటీవల మూడో సినిమాకు కూడా కమిట్ అయినట్లు రష్మిక వెల్లడించారు.

'సుల్తాన్' సినిమాతో కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మిక.. తాజాగా మరో తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. తమిళ హీరో శివ కార్తికేయన్ - అనుదీప్ కేవీ కాంబినేషన్ లో ఓ ద్విభాషా చిత్రం రానుందని ఈ మధ్య వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నే తీసుకుంటున్నారట. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

'పిట్ట గోడ' చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనుదీప్ కేవీ.. 'జాతి రత్నాలు' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ క్రమంలో ఇప్పుడు శివ కార్తికేయన్ ని టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకున్నారని అంటున్నారు. కామెడీ థ్రిల్లర్ జోనర్ లో శివకార్తికేయన్ కి అనుదీప్ ఓ కథ వినిపించారని.. దీనికి హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని టాక్ వినిపిస్తోంది. 'రెమో' 'సీమరాజా' హీరో వంటి తెలుగు డబ్బింగ్ చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులకు సుపరిచితుడైన శివ కార్తికేయన్ కు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి, ఓ అగ్ర నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ క్రమంలో ఇప్పుడు రష్మిక మందన్నా ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసారని అంటున్నారు. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాలి. ఏదేమైనా స్టార్ హీరోయిన్ రష్మిక కు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉందనేది మాత్రం వాస్తవం.
Tags:    

Similar News