ఫోర్బ్స్ జాబితాలో ర‌ష్మిక - స‌మంత‌!

Update: 2021-10-17 08:33 GMT
దక్షిణ భారతదేశంలోని టాప్ 30 అత్యంత ప్రభావవంతమైన ఇన్ స్టాగ్రామ్ ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుద‌ల చేసింది.  ఈ జాబితాలో తొలి ఐదు స్థానాల్లో రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ - -యష్ - సమంత - అల్లు అర్జున్ నిలిచారు.త‌న‌దైన అందం ప్ర‌తిభ చొర‌వ‌తో ఇన్ స్టాగ్రామ్ లో 20 మిలియన్లకు పైగా అనుచరులతో రష్మిక మందన్న దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో టాప్ పొజిష‌న్ లో నిలిచారు. ఆ త‌ర్వాత స‌మంత నాయిక‌గా ఈ ఖ్యాతిని దక్కించుకుంది.

ఇంత‌కుముందు నేష‌న‌ల్ క్ర‌ష్ గా పాపుల‌రైన ర‌ష్మిక ఫోర్బ్స్ ఇన్ స్టా- జాబితాలోనూ అత్యంత ప్రభావవంతమైన సెల‌బ్రిటీగా నిలిచింది. నిరంత‌రం త‌న‌ను ఇన్ స్టా వేదిక‌గా అనుసరించేవాళ్లు  లైక్ లతో హోరెత్తిస్తున్నారు. ర‌ష్మిక వీడియోల‌ను వెంబ‌డించి చూస్తున్నార‌ట‌. వీడియో వీక్షణల సంఖ్యలో అధిక వృద్ధి రేటును నమోదయింది.

అందుకే సౌత్ ఇండియా నుండి ఇన్ స్టాగ్రామ్ లో అత్యంత ప్రభావవంతమైన నటీనటులలో రష్మిక మొదటి స్థానాన్ని సంపాదించింది.  ర‌ష్మిక తర్వాత తన స‌హ‌చ‌ర క‌థానాయ‌కుడు విజయ్ దేవరకొండ .. కన్నడ నటుడు రాకింగ్ స్టార్ యష్ ఉన్నారు. జాబితాలో ఉన్న చాలా మంది తార‌లు సౌత్ అంత‌టా సుప‌రిచితులే. వారంతా 50 శాతానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పని చేస్తున్నారు. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌తో అనుబంధం అంటే.. నాలుగు దక్షిణ భారత సినిమా పరిశ్రమలలో అతిపెద్ద పరిశ్ర‌మ‌లో స్టార్ అని అర్థం.

ఇన్ స్టా రేటింగులో ఎవ‌రెవ‌రు టాప్ 10లో..?

రష్మిక మందన్న - 9.88 ...విజయ్ దేవరకొండ - 9.67..యష్ - 9.54.. సమంత - 9.49 .. అల్లు అర్జున్ - 9.46 ..దుల్కర్ సల్మాన్ - 9.42.. పూజా హెగ్డే - 9.41 ...ప్రభాస్ - 9.40..సూర్య - 9.37..తమన్నా - 9.36 ..
తదుపరి 10 స్థానాల్లో మహేష్ బాబు- చరణ్- ధనుష్- జూనియర్ ఎన్టీఆర్- కాజల్- రాశి ఖన్నా- రకుల్ ప్రీత్- ఇలియానా- నాని- సాయి పల్లవి తదితరులు ఉన్నారు.

ఫోర్బ్స్ ఆక‌ర్ష‌ణ క‌లిగిన‌ ఇంటర్వ్యూలలో మహేష్ బాబు ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రెండు దశాబ్దాలకు పైగా సూపర్ స్టార్ గా ఏల్తున్న అత‌డి అందం చందం సుదీర్ఘ కెరీర్ కి కార‌ణం.. నా అభిమానుల ప్రేమ అని మ‌హేష్ తెలిపారు. అలాగే నయనతార ఇంటర్వ్యూ మొదటిసారిగా విస్తృత అంశాలపై మాట్లాడారు. గట్ ఫీలింగ ఉన్న న‌టీమ‌ణిగా న‌య‌న్ కి పేరుంది. త‌న‌ కోసం పాత్ర‌ల సృజ‌న స‌హా  పారితోషికం విషయంలో మహిళలు తమ విలువను డిమాండ్ చేసే సమయం వస్తుందని న‌య‌న్ పేర్కొంది. మ‌హేష్ ప్ర‌స్తుతం స‌ర్కార్ వారి పాట ను వేగంగా పూర్తి చేసి ప‌లు చిత్రాల్లో న‌టించేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు. అలాగే న‌య‌న‌తార వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `కాతు వాకుల రేండు కాద‌ల్` రిలీజ్ కి రానుంది. ఇందులో స‌మంత మ‌రో క‌థానాయిక‌గా న‌టించారు.
Tags:    

Similar News