సతిసావిత్రి పాత్ర ఇవ్వండి.. ట్రోల్స్‌ కు రష్మీ కౌంటర్‌

Update: 2020-03-18 04:26 GMT
సోషల్‌ మీడియాలో జబర్దస్త్‌ యాంకర్‌ రష్మి గౌతమ్‌ చాలా యాక్టివ్‌ గా ఉంటుందనే విషయం తెల్సిందే. పలు సామాజిక విషయాలపై స్పందిస్తూనే తనను ఎవరైనా విమర్శించినా.. తాను చేస్తున్న జబర్దస్త్‌ పై ఎవరైనా కామెంట్స్‌ చేసినా కూడా వెంటనే స్పందిస్తుంది. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వ్యక్తి ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా కంటే కూడా జబర్దస్త్‌ కామెడీ షో సమాజానికి చాలా కీడును చేస్తుంది. కరోనా కంటే ముందు జబర్దస్త్‌ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్‌ చేశాడు.

అతడి పోస్ట్‌ కు చాలా మంది స్పందిచారు. జబర్దస్త్‌ కామెడీ షో లో బూతు కామెడీతో పాటు యాంకర్స్‌ స్కిన్‌ షో మరీ ఎక్కువ అవుతుందని అందాల ప్రదర్శణకు అది ఒక అడ్డాగా మారిందని యూత్‌ ను చెడగొట్టే విధంగా ఆ షో ఉంటుందంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్స్‌ కామెంట్స్‌ పై యాంకర్‌ రష్మీ సీరియస్‌ గా స్పందించింది. మిమ్ములను ఎవరు కూడా బలవంతంగా జబర్దస్త్‌ షో చూడమని అనడం లేదు.

మీ చేతులు కట్టేసి టీవీ ముందు కూర్చో బెట్టి ఆ షోను చూపించడం లేదు. మేము స్టేజ్‌ పై డాన్స్‌ చేస్తున్న సమయంలో కళ్లు మూసుకోండి లేదంటే ఛానెల్‌ మార్చుకోండి. అంతే తప్ప మాపై విమర్శలు చేసే హక్కు మీకు ఎక్కడిది. షో హిట్‌ అయ్యింది కనుకే ఎక్కువ మంది జనాలు చూస్తున్నారంటూ రష్మి అభిప్రాయ పడినది.

నేను గ్లామరస్‌ గా కనిపించ వద్దనుకుంటే మీరు నిర్మాతగా మారి డబ్బులు పెట్టి ఒక సినిమా తీయండి. ఆ సినిమాలో నాకు సతి సావిత్రి పాత్రను ఇవ్వండి చేస్తానంటూ కౌంటర్‌ ఇచ్చింది. రష్మీ రియాక్షన్‌ ను చాలా మంది అభినందించారు. షో ఇష్టం లేని వారు చూడనక్కర్లేదు.. చూస్తూ విమర్శలు చేయడం ఏంటీ అంటూ పలువురు రష్మీకి మద్దతుగా కామెంట్స్‌ చేశారు.


Tags:    

Similar News