చాన్స్ ఇప్పిస్తానంటూ పిలిచి రేప్ చేయబోయాడు
అక్కడ.. ఇక్కడ అనే తేడా లేకుండా కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్ల ఉంది. అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో ఉంది.. ఆ మాటకు వస్తే ఇతర రంగాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. కాస్టింగ్ కౌచ్ గురించి ఈమద్య కాలంలో ఎక్కువగా మీడియాలో వార్తలు వస్తుండటంతో కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. కాని గతంలో ఇండస్ట్రీకి అమ్మాయిలు వచ్చారు అంటే వారికి బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదంటే వారిని ఎలాగైనా వాడేసుకోవాలని ప్రొడక్షన్ మేనేజర్ లు ప్రయత్నించేవారట. తాజాగా తన పాత అనుభవాలను బాలీవుడ్ నటి.. బిగ్ బాస్ ఫేం రష్మీ దేశాయ్ వెళ్లడి చేసింది.
రష్మీ దేశాయ్ నటిగా పాపులారిటీ దక్కించుకుంది. మద్యలో కనిపించకుండా పోయి మళ్లీ బిగ్ బాస్ వల్ల ఫేం దక్కించుకుంది. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురు చూస్తుందట. ఈ సమయంలో ఒక టాక్ షోలో ఈమె పాల్గొంది. ఆ టాక్ షోలో కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చెప్పుకొచ్చింది. 16 ఏళ్ల వయసులో హీరోయిన్ అవ్వాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చిన తనను ఎంతో మంది మోసం చేసేందుకు ప్రయత్నించారు. కెరీర్ ఆరంభం నుండే నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను.
ఒకసారి యశ్ రాజ్ పేరుతో సురజ్ అనే వ్యక్తి మోసం చేసేందుకు చూశాడు. యశ్ రాజ్ వద్ద నేను వర్క్ చేస్తున్నాను. ఆయన సినిమాల ఆడిషన్స్ కు పిలుస్తాను అంటూ నెంబర్ తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సురజ్ నుండి ఫోన్ వచ్చింది. ఆడిషన్స్ జరుగుతున్నాయి అంటే ఒక అడ్రస్ కు వెళ్లాను. అక్కడ ఆడిషన్స్ జరగడం లేదు. సురజ్ ఒక్కడే ఉన్నాడు. నాకు అనుమానం వచ్చి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాను. కాని అతడు కూల్ డ్రిరక్ తీసుకుని వెళ్లమన్నాడు. అందులో ఏమైనా కలిపి ఉంటాడని నాకు అనిపించింది. అందుకే నేను తాగను అన్నాను. నాతో బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించాడు. నేను అతడిని నెట్టేసుకుని బయటకు వచ్చాను.
విషయం అమ్మకు చెప్పాను. ఒకరోజు హోటల్ లో అతడిని అందరి ముందు అమ్మ చెంప దెబ్బ కొట్టి మళ్లీ నా కూతురు వైపు చూడవద్దంటూ హెచ్చరించింది. అప్పటి నుండి కూడా అతడు నాకు కనిపించలేదు. మళ్లీ అటువంటి వారు కొందరు ఎదురు అయినా వారికి ముందే దూరంగా ఉంటూ వచ్చాను.