ఆ క్రూరుడి పాత్ర అదిరిపోతుందట

Update: 2017-05-28 04:52 GMT

సంజయ్ లీలా భన్సాలి నిర్మాణలో ఉన్న పద్మావతి సినిమాలో రణవీర్ - దీపికా - షాహిద్ కపూర్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. భన్సాలి సినిమాలో ఇప్పటికే రణవీర్ కు , దీపికాకు పని చేసిన అనుభవం ఉంది. కాబట్టి  అతని సినిమాకు చేస్తున్న పాత్ర కోసం ఎంతలా ప్రిపేర్ కావాలో ఇప్పటికే అర్ధమై ఉంటుంది. అటు షాహిద్ కూడా ఇటువంటి పాత్రలను ఆకళింపు చేసుకొని నటిస్తాడు.

రణవీర్ ఇప్పుడు పద్మావతి సినిమాలో క్రూరమైన చాలా ప్రమాదకరమైన అలౌద్దీన్ ఖిల్జీ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ విషయం గురించి సినిమా టీమ్ చెబుతూ.. ''రణవీర్ పూర్తిగా టీమ్ ప్లేయర్. అతనిలో అటువంటి నాయకుడి లక్షణాలు ఉన్నాయి. అందరినీ స్నేహపూర్వకంగా పలకరిస్తాడు అందరినీ ప్రేమిస్తాడు అలాగే ప్రేమించబడతాడు. ఎప్పుడూ మంచి ఎనర్జి తో పని చేస్తాడు. కానీ ఇప్పుడు చేస్తున్న అలావుద్దీన్ ఖిల్జీ  కోసం సెట్ లోకి వెళ్ళంగానే అతను పూర్తిగా ఆ పాత్ర లోకి ట్రాన్స్ఫోర్మ్ అయ్యి.. మళ్ళీ కట్ చెప్పగానే మామూలుగా మారుతాడు. కేవలం మెథడ్ యాక్టింగ్ లో బాగా ఆరితేరిన వాళ్ళు మాత్రమే ఇలా చేయగలరు. అలావుద్దీన్ ఖిల్జీ లాంటి క్రూరుడు లా ఉండటం మళ్ళీ రణవీర్ లా స్విచ్ ఆఫ్ కావడం వండర్‌ ఫుల్'' అంటున్నారు సన్నిహితులు.

భాజీరావ్ మస్తానీ లాంటి పాత్ర కోసం రణవీర్  అకుంఠిత దీక్షా  విశ్వాసం తో చేశాడు. ఇప్పుడు కూడా తన పని పట్ల అంకితభావం చూపి సినిమా కి గొప్ప బలంగా మారుతున్నాడు. ఈ సినిమా తో మనం రణవీర్ ని డార్క్ నైట్ సినిమాలో  హీత్ లెడ్జెర్ చేసిన జోకర్ పాత్ర లా సినీ అభిమానులు మరిచిపోలేని నటన కనబరుస్తాడు అంటున్నారు. లెటజ్ సీ.
 
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News