రంగస్థలం పాటలో ఆ పదం తీసేశారట

Update: 2018-03-17 05:52 GMT
పాటల రచయితల ఆలోచనలకు ఈ మధ్య బ్రేకులు చాలానే పడుతూనే ఉన్నాయి. ఎలాంటి వర్గాన్ని పెన్ను తాకకుండా ఉండాలని ఒకటికి పదిసార్లు అలోచించి రాస్తున్నారు. ఒక్కసారి రాసిన తరువాత మార్పులు చేస్తే పాటకు మానిపోని గాయమైనట్లే.. అందుకే దర్శక నిర్మాతలు కూడా మాటలపై పాటలపై ప్రత్యేక ద్రుష్టి పెడుతున్నారు. బావుండకపోయినా పర్లేదు గాని గొడవలు కాకుండా ఉంటే బెటర్ అని ఆలోచిస్తున్నారు.

రీసెంట్ గా రంగస్థలం సినిమాకు ఎవరు ఊహించని విధంగా ఒక వివాదం చుట్టుముట్టడంతో దర్శకుడు వెంటనే దాన్ని వైరల్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని తెలుస్తోంది. రంగమ్మ మంగమ్మ అనే పాటలో గొల్లభామ అనే లైన్ ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని ఆరోపణలు రావడంతో సుకుమార్ రీసెంట్ గా వివరణ కూడా ఇచ్చాడు. ఎవ్వరిని హార్ట్ చేయడం గాని అలాగే తక్కువ చేయడం కోసం సినిమా చేయలేదు అని చెప్పాడు.

ఫైనల్ గా పాటలో గొల్లభామ అనే పదాన్ని తీసేసి సింపుల్ గా గోరువంక అనే పదాన్ని యాడ్ చేసినట్లు సమాచారం. గత ఏడాది కుడా దువ్వాడ జగన్నాథమ్ సినిమాపై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. నమకం చమకం అనే పదాలను తొలగించాలని చెప్పడంతో చిత్ర యూనిట్ చర్చలు జరిపి తొలగించింది. ఇలాంటి వివాదాలు ఎక్కువవుతుండడంతో ప్రస్తుతం పాటల రచయితలు జాగ్రత్త పడుతున్నారు. 
Tags:    

Similar News