ముద్దుల విషయంలో కోహ్లీ లక్కీ

Update: 2016-11-02 05:20 GMT
బాలీవుడ్ లో డ్రీమ్ బోయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ కపూర్.. హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన యే దిల్ హై ముష్కిల్ కు సూపర్ హిట్ టాక్ రావడంతో.. రణబీర్ లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ప్రమోషన్స్ విషయంలో కూడా బాగా అగ్రెసివ్ గా మారిపోయాడు. ఐశ్వర్యతో క్లోజ్ సీన్స్ చేసే ఛాన్స్ రావడం.. ఆమే ప్రోత్సహిచినపుడు.. ఛాన్స్ దొరికింది రెచ్చిపోయానంటూ వివాదం రాజేసిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు అనుష్కపై కూడా పంచ్ లు వేస్తున్నాడు.

ఐశ్వర్య.. అనుష్కలలో ఎవరితో ముద్దు ఎంజాయ్ చేశారంటూ మీడియా జనాలు అడిగిన ప్రశ్నకు.. రణబీర్ సూటిగానే ఆన్సర్ చేశాడు. 'ఐశ్వర్యతో నాకు ముద్దు సీన్లు లేవు. కానీ అనుష్కను మాత్రం మరిన్ని సార్లు ముద్దు పెట్టుకుందామని అనిపించింది. తను సూపర్ కిస్సర్. అతనెవరో కానీ బాగా లక్కీ' అంటూ అనుష్క లవర్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి కామెంట్ చేశాడు రణబీర్ కపూర్.

ఇదంతా జరిగిన కాసేపటికే.. విరాట్-అనుష్క శర్మలు గోవాలోనో ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తూ ఫోటోలకు చిక్కారు. ఆ తర్వాత దగ్గరలోని ఓ రెస్టారెంట్ లో కలిసి ఓ డిన్నర్ డేట్ కి అటెండ్ అయ్యారు కూడా. ఈ రెండు సంఘటనలు వరుసగా జరగడంతో.. ఇక వారిద్దరూ బ్రేకప్ కి బ్రేకప్ చెప్పేశామని అఫీషియల్ గా అనౌన్స్ చేసేసినట్లే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News