బాలీవుడ్ అగ్ర‌న‌టుడు టెన్త్ వ‌ర‌కే చ‌దివాడ‌ట‌

Update: 2017-07-10 04:57 GMT
చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో అమ్మాయిల మ‌నుసుల్ని దోచేసే బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు ర‌ణ‌బీర్ క‌పూర్‌.  వెండితెర‌పై అత‌గాడు ఎంత‌గా చెల‌రేగిపోతాడో తెలిసిందే. అయితే.. త‌న‌కు సంబంధించిన షాకింగ్ విష‌యాల్ని ఆయ‌న తాజాగా చెప్పుకొచ్చారు.

తాను కేవ‌లం ప‌దో త‌ర‌గతి వ‌ర‌కే చ‌దివిన‌ట్లుగా వెల్ల‌డించి షాక్ త‌గిలేలా చేశారు. అంతేనా.. త‌మ కుటుంబంలో ఎక్కువ చ‌దివింది తానేన‌ని చెప్పాడు. సీనియ‌ర్ న‌టుడు రిషిక‌పూర్ కుమారుడైన ర‌ణ్ బీర్ తాజాగా జ‌గ్గా జాసూస్ చిత్రాన్ని చేశారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో బిజీగా ఉన్న ఆయ‌న‌.. తాజాగా పిల్ల‌ల‌తో మ‌న‌సు విప్పి మాట్లాడారు.ఈ  సంద‌ర్భంగా త‌న చ‌దువు గురించి వివ‌రాలు వెల్ల‌డించి షాక్‌కు గురి చేశారు.

త‌న తాత ఆరో త‌ర‌గ‌తి ఫెయిల్ అయ్యార‌ని.. త‌న తండ్రి రిషీ క‌పూర్ ఎనిమిదో త‌ర‌గ‌తి వ‌ర‌కూ మాత్ర‌మే చ‌దివార‌న్నారు. తాను మాత్రం టెన్త్ పాస్ అయ్యాన‌ని.. అది కూడా 56 శాతం మార్కుల‌తోనే పాస్ అయిన‌ట్లుగా వెల్ల‌డించారు. మార్కులు త‌క్కువ వ‌చ్చినా.. త‌ర్వాతి ప‌రీక్ష‌ల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాన‌ని త‌న త‌ల్లికి చెప్పి త‌ప్పించుకునేవాడిన‌ని చెప్పాడు. బాలీవుడ్ ప్ర‌ముఖ హీరో కేవ‌లం టెన్త్ మాత్ర‌మే చ‌దివిన వైనాన్ని ఓపెన్ గా చెప్ప‌టం గొప్ప‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News