9 కోట్లు ఇస్తామన్నా యాడ్ చేయనన్నాడు

Update: 2017-04-27 04:53 GMT
ఫెయిర్నెస్ క్రీమ్ ల పై గత కొన్ని వారాలుగా మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. స్టార్స్ వీటిని ప్రోమోట్ చేయడం వలన సొసైటీలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. అది వివక్షకు దారితీసే విధంగా ఉంటుందని చాలామంది ఆవేదన. ఆ యాడ్స్ కూడా రంగు లేని వాళ్ళ మీద ఒక చిన్నచూపు ఉండేలా ఉన్నాయని వాటిని చేయకూడదు అని అన్నీ వర్గాల నుండి వినిపిస్తోంది.

ఈ చర్చకు అభయ్ డియోల్  తెర తీశాడు. అక్కడ నుండి ఇది అడివి లో నిప్పులా ఒక్కొక్కరినీ అంటుకుంది. ముందు దీపికా పడుకోన్ షారూఖ్ ఖాన్ ఆ తర్వాత సోనమ్ కపూర్. వీళ్ళంతా వారి వారి అభిప్రాయాలు చెప్పారు. కానీ సోనమ్ అంతటితో ఆగక డియోల్  సిస్టర్స్ అయన ఇషా చేస్తున్న బ్రాండింగ్ వర్క్ పై చిన్న చురక అంటించింది. ఇప్పుడు వాళ్లందరిని పక్కన పెట్టి ఈ వివాదం నవతర మేటి నటుడు సోనమ్ కపూర్ మొదటి కొ స్టార్ అయన రణబీర్ కపూర్ దగ్గరకు వచ్చి ఆగింది. అతను ఇప్పుడు సంజయ్ దత్ బయో పిక్ సినిమా తో తీరిక లేనంత నిండా మునిగి  ఉన్నాడు. దాని తరువాత అయాన్ ముఖర్జీ సినిమా డ్రాగన్ ఒకటి ఉంది.  రణబీర్ దగ్గరకు ఒక బ్రాండ్ వచ్చి 9 కోట్లు ఇస్తాం మీకు నచ్చిన అప్పుడు షూట్ చెద్డాం అని ఆఫర్ ఇస్తే.. మనోడు వెంటనే నో చెప్పేశాడట.

మొత్తానికి ఫెయిర్నస్ క్రీముల యాడ్లు మనోళ్లు తెలివిగా నిరాకరిస్తున్నారనమాట. ఇవి అలా ఉండగా రణబీర్ కత్రినా కైఫ్ విడిపోయాక విడుదల అవుతున్న ఈ కపుల్ సినిమా ''జగ్గా జసూస్'' జూలై 14 విడుదలకి సిద్దం చేస్తున్నారు

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News