సంజయ్ దత్ గా రణబీర్ ను చూశారా?
బాలీవుడ్ హీరోలు సంజయ్ దత్.. రణబీర్ కపూర్ లను పక్క పక్కనబెట్టి చూస్తే అంతగా పోలికలేమీ ఉండవు. ఒక్క హైట్ విషయంలో మాత్రమే ఇద్దరూ మ్యాచ్ అవుతారేమో. సంజూ చాలా రఫ్ గా ఉంటాడు. రణబీర్ మాత్రం చాక్లెట్ బాయ్ లాగా ఉంటాడు. మరి సంజయ్ దత్ పాత్ర చేయడానికి రణబీర్ ఏమాత్రం సరిపోతాడో అని అని చాలామంది సందేహించారు. కానీ ఆ సందేహాలన్నీ ఇప్పుడు రణబీర్ లుక్ చూశాక పటాపంచలైపోతాయనడంలో సందేహం లేదు. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంజయ్ దత్ బయోపిక్ లో రణబీర్ లుక్ కు సంబంధించిన కొన్ని లీక్డ్ పిక్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
అవతారం మొత్తం మార్చేసి సంజయ్ దత్ లాగా మారిపోయినట్లే ఉన్నాడు రణబీర్ ఇందులో. నెత్తిన జుట్టు.. గడ్డం.. మీసం.. మొత్తంగా బాడీ లాంగ్వేజ్ కూడా మార్చేసి సంజూకు డిట్టోలా అనిపిస్తున్నాడు రణబీర్. ఈ లుక్స్ చూశాక ఒక్కసారిగా సినిమా మీద క్యూరియాసిటీ పెరిగిపోయేలా ఉంది పరిస్థితి. ఈ చిత్రంలో సంజయ్ దత్ తల్లి నర్గీస్ పాత్రను ఒకప్పటి అందాల హీరోయిన్ మనీషా కొయిరాలా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే సగం చిత్రీకరణ పూర్తి చేసుకుందట. ఐతే సినిమాను వచ్చే ఏడాదే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు హిరాని. సంజయ్ దత్ హిరానికి అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. హిరాని అతడితో మున్నాభాయ్ ఎంబీబీఎస్.. మున్నాభాయ్ లగేరహో లాంటి అద్భుతమైన సినిమాలు తీశాడు. అతడి జీవితాన్ని దగ్గర్నుంచి చూసిన హిరాని.. తెరమీద మిత్రుడి లైఫ్ స్టోరీని ఎలా చూపిస్తాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/