అతడ్ని ఇద్ద‌ర‌మ్మాయిలు మోసం చేశారట‌

Update: 2016-11-02 22:30 GMT
ప్రేమ‌లో ప‌డ‌టం.. విడిపోవ‌టం..కోపాలు.. తాపాలు.. విర‌హాలు.. ఇలాచెప్పుకుంటూ పోతే చాలానే లిస్ట్ అవుతుంది. ప్ర‌తిఒక్క‌రి జీవితంలో ఏదో ఒకద‌శ‌లో ఎవ‌రో ఒక‌రితో ప్రేమ‌లో ప‌డ‌టం కామ‌న్‌. అలాంటి అనుభ‌వాలుసామాన్యులు త‌మ స‌న్నిహితుల‌తో చెబుతుంటారు. అయితే.. సెల‌బ్రిటీల‌కున్నసౌక‌ర్యం ఏమిటంటే.. అలాంటి ముచ్చ‌ట్లు వార్తాంశాలుగా మారిపోతుంటాయి.ప్ర‌ముఖుల ప‌ర్స‌న‌ల్ విష‌యాల్ని తెలుసుకోవాల‌న్న కుతూహ‌లం ఉండ‌టం తెలిసిందే. తాజాగా అలాంటి ముచ్చ‌టే ఒక‌టి కండల వీరుడు ర‌ణ్ వీర్ సింగ్ జీవితంలో చోటు చేసుకుందట. రీల్ లైఫ్ లో పలువురు భామలతో లవ్వాట ఆడే ఈ మ్యాన్లీ హీరో.. రియ‌ల్ లైఫ్‌ లో దీపికా ప‌దుకునేతో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలుతున్న ముచ్చ‌ట తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా త‌న చిన్న‌నాటి బ్రేక‌ప్ ల గురించి చెప్పుకొచ్చాడు. తాను టీనేజ్ లో ఉన్న‌ప్పుడు ఇద్ద‌రు అమ్మాయిలు త‌న‌కు హ్యాండ్ ఇచ్చిన‌ట్లుగాచెప్పాడు. దీంతో.. త‌న హృద‌యానికి తీవ్ర గాయ‌మైంద‌న్నాడు. తానుప్రేమించిన అమ్మాయిలు.. త‌న ప్రాణ స్నేహితుల్ని ఇష్ట‌ప‌డి వారి ప్రేమ‌లోప‌డ్డార‌ని.. ఈ కార‌ణంతో త‌న ప్రాణ‌స్నేహితులు త‌న‌కు దూర‌మైన‌ట్లు చెప్పాడు.

తానెంతో ప్రేమించిన అమ్మాయిలు అలా హ్యాండ్ ఇవ్వ‌టంతో.. ప్ర‌పంచంఅంత‌మైంద‌న్న భావ‌న మొద‌లు.. దారుణ‌మైన వేద‌న‌ను తానుఅనుభ‌వించిన‌ట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ రోజుల‌న్నీ చాలా భిన్నంగా ఉండేవ‌ని చెప్పిన ర‌ణ‌వీర్ కు రీల్ లైఫ్ ల‌వ్ ముచ్చ‌ట్లు ఎలా ఉన్నా.. రియ‌ల్ లైఫ్‌లోప్రేమ‌ను ఇతగాడు ఎంత‌ మేర స‌క్సెస్ అవుతాడో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News