ఇంకో స్టార్ ప్రభాస్ ఫ్యానయ్యాడు

Update: 2017-07-06 11:02 GMT
మన హీరోలు ఫలానా బాలీవుడ్ హీరో.. హీరోయిన్ కు నేను ఫ్యాన్ అని చెప్పడమే ఉండేదిన్నాళ్లూ. కానీ ఇప్పుడు బాలీవుడ్ వాళ్లే మన హీరో గురించి గొప్పగా మాట్లాడేస్తున్నారు. తాము అతడికి అభిమానులం అంటున్నారు. ఆ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు ప్రభాస్.

వేరే ఇండస్ట్రీల సెలబ్రెటీలు సైతం అతడికి అభిమానులుగా మారిపోయారు. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ తారలు ప్రభాస్ గురించి గొప్పగా మాట్లాడారు. ఇటీవలే కత్రినా కైఫ్ కూడా తనకు ప్రభాస్ అంటే అభిమానమని చెప్పింది. ఆమెతో కలిసి ‘జగ్గా జాసూస్’లో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా తాను ప్రభాస్‌ కు అభిమానినంటూ స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.

ప్రభాస్ అంటే తనకు ఈ మధ్య చెప్పలేనంత ఇష్టం కలుగుతోందని.. బాహుబలి సినిమాలో అతను చాలా బాగా కనిపించాడని రణబీర్ తెలిపాడు. బాహుబలిగా ప్రభాస్ తప్ప ఇంకొకరిని ఊహించుకోలేమని.. ఈ సినిమా చూశాక తాను కూడా ప్రభాస్ అభిమానిగా మారిపోయానని రణబీర్ తెలిపాడు. ఈ మధ్య రణబీర్ జోరు కొంచెం తగ్గింది కానీ.. మూడేళ్ల కిందట అతడి రేంజే వేరు. ఖాన్ హీరోలకు పోటీ ఇచ్చే స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ కపూర్ వారసుడు. ఆ రేంజి హీరో ప్రభాస్ గురించి ఇలా మాట్లాడటం విశేషమే.
Tags:    

Similar News