ఆ హీరో 35 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నాడా?
రణబీర్ కపూర్ హిట్టు కొట్టి చాలా కాలమైపోయింది. అతడి సినిమాలు వరుసగా ఫెయిలవుతున్నాయి. తన రెమ్యూనరేషన్ తగ్గించేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు బ్రాండ్ వాల్యూ కూడా కొంచెం తగ్గినట్లు చెబుతున్నారు. కానీ ఇలాంటి టైంలో కూడా ఏకంగా రూ.35 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నాడీ ఛార్మింగ్ హీరో. ముంబయిలో అతను తాజాగా కొన్న లగ్జీరియస్ ఫ్లాట్ ఖరీదు రూ.35 కోట్లని సమాచారం.
ముంబయి శివార్లలోని పాలి హిల్స్ అనే వెంచర్ ఏడో అంతస్థులో రణబీర్ రూ.35 కోట్ల ఫ్లాట్ ను గత నెలలోనే కొన్నాడట. మొన్నటిదాకా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రూ.30 కోట్లు పెట్టి కొన్న ఫ్లాట్ గురించే అంతా చర్చించుకున్నారు. సెలబ్రెటీలు కొన్న ఫ్లాట్లలో ఇదే అత్యంత లగ్జీరియస్ అనుకున్నారు. కానీ రణబీర్ ఆ రికార్డును దాటేశాడు. ఐతే ఈ ఫ్లాట్ కోసం మొత్తం డబ్బులు రణబీర్ పెట్టుకుని ఉంటాడా అన్నది సందేహమే.
మామూలుగా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇలాంటి లగ్జీరియస్ ఫ్లాట్ల మీద హైప్ తీసుకురావడానికి సెలబ్రెటీల్ని లైన్లోకి తెస్తుంటారు. వాళ్లను ప్రచారానికి ఉపయోగించుకుని తక్కువ మొత్తానికి ఫ్లాట్ కట్టబెడతారు. కానీ బయటికి మాత్రం భారీ రేటు పెట్టి కొన్నట్లు ప్రచారం చేస్తారు. రణబీర్ ఫ్లాట్ ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అంటే కోటీశ్వరుల్లో సైతం క్రేజ్ ఉంటుంది కదా. దీంతో ఆటోమేటిగ్గా మిగతా ఫ్లాట్లు వేగంగా అమ్ముడైపోతాయి. అందులోనూ రణబీర్ ఉండే ఫ్లోర్లో ఫ్లాట్లకు డిమాండ్ కొంచెం ఎక్కువే ఉంటుంది కూడా. ఆ రకంగా వచ్చే లాభంలో కొంత మైనస్ చేసి రణబీర్ కు కాస్త తక్కువ రేటుకే ఫ్లాట్ కట్టబెట్టి ఉంటారని అంచనా.