కత్రినా..రణబీర్.. రింగు తొడిగేసుకున్నారు
ఎట్టకేలకు రణబీర్ కపూర్ సైలెన్స్‌కి టాటా చెప్పేసే ఓ పని చేశాడు. ఇంతకాలం కత్రినతో చాటుమాటు ప్రేమాయణం నడిపించిన రణబీర్ నిన్నటిరోజున కత్రిన పుట్టినరోజున ప్లాటినం, వజ్రపు పొదుగులతో కూడిన బ్యాండ్ ఒకటి ప్రియురాలికి బహుమతిగా ఇవ్వడమే కాకుండా ఓ డిజైనర్ రింగ్ కూడా తొడిగాడు. అరుదైన కానుక ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఈ విషయంపైనే సీరియస్ డిష్కసన్ సాగుతోంది. ఇక పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టేనని కన్ఫమ్ చేసేస్తున్నారంతా.
నాలుగేళ్ల ప్రేమాయణానికి ఇక ఫుల్‌స్టాప్ పడినట్టే. రింగు తొడిగేశాడు కదా! అని పార్టీకి విచ్చేసిన అతిధులంతా ఒకటే లొల్లు పెడుతున్నరు. అయితే కుర్రహీరో రణబీర్ జనాల నోటికి తాళం వేసేందుకు తాయత్తులా దీన్ని వాడుతున్నాడా? అన్న సందేహమూ రాకపోలేదు. రణబీర్, కత్రిన ఇద్దరూ కెరీర్ పరంగా బిజీగానే ఉన్నారు. ఇక మునుముందు సినిమాలు తగ్గించుకుని పెళ్లి బంధంతో ఒకటవ్వాలనుకుంటున్నారని అంతా ముచ్చటించుకుంటున్నారు. అయితే చాక్లెట్‌బోయ్ నోరు మెదిపి అసలే విషయమూ తేల్చడం లేదని గుసగుసలు ఆడుకుంటున్నారు. అయితే అతడు ఏం చెప్పాలనుకున్నా అది ఇలా చేతల్లోనే చెప్పేస్తున్నాడని అనుకుంటున్నారు. దట్సిట్.