• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'విరాటపర్వం' రిలీజ్ డేట్...

'విరాటపర్వం' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రానా..!

By - Tupaki Desk
Update: 2021-01-28 14:16 GMT
దగ్గుబాటి రానా - సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''విరాటపర్వం''. 'రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్' అనేది ట్యాగ్‌ లైన్‌. 'నీదీ నాదీ ఒకే క‌థ' ఫేమ్ వేణు ఊడుగుల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1990ల నాటి నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవి అన్న పాత్రలో కనిపించనున్నాడు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ను ఫిక్స్‌ చేశారు.

తాజాగా 'విరాటపర్వం' చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుద‌ల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నక్సలైట్ గెటప్ లో ఉన్న రానా పోస్టర్ ని వదిలారు. ఇకపోతే ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చాడు. డానీ సాంచెజ్‌ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. వైవిధ్యమైన కథతో వస్తున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి - నివేథా పేతురాజ్ లు కీల‌క పాత్ర‌లు పోషించారు. నందితా దాస్‌ - ఈశ్వ‌రీరావు - జ‌రీనా వ‌హాబ్ - నవీన్ చంద్ర - సాయి చంద్ - బెనర్జీ - రాహుల్ రామకృష్ణ - నాగినీడు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
Tags:    
  • Rana 
  • Sai Pallavi 
  • Virata Parvam 
  • Telugu NEws 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS