అనుష్క రెస్పాన్సిబిలిటీ రానాదే

Update: 2015-11-30 09:11 GMT

Full View
సినిమా కోసం ఇండియాలో ఏ స్టార్ హీరోయిన్ చేయని సాహసం చేసింది అనుష్క. కొంచెం స్లిమ్ అవ్వమంటే ఎవరైనా అయిపోతారు కానీ.. బరువు పెరగమంటే ఎవరు పెరుగుతారు? కానీ అనుష్క మాత్రం ‘నో’ చెప్పకుండా ప్రొసీడ్ అయిపోయింది. ‘సైజ్ జీరో’ సినిమా కోసం ఏకంగా 17 కిలోల బరువు పెరిగింది. మరి ఈ పెరిగిన బరువును తగ్గించుకోవడడానికి అనుష్క ఎలా కష్టపడుతోంది? ఆమె బరువు తగ్గించే ట్రైనర్ ఎవరు? ఇంకెవరు దగ్గుబాటి రానానే. అవును.. అనుష్క బరువు తగ్గించే బాధ్యత రానానే తీసుకున్నాడు.

టాలీవుడ్లో బెస్ట్ ఫిజిక్ - ఫిట్ నెస్ మెయింటైన్  చేసే హీరోల్లో రానా ఒకడు. అందుకే అనుష్క రానానే నమ్ముకుంది. అతడితో కలిసి జిమ్ లో కసరత్తులు చేసింది. అతనే దగ్గరుండి అనుష్కతో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయిస్తున్నాడు. సైజ్ జీరో డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి - అతడి భార్య కనిక కూడా పక్కనుండగా రానా దగ్గరుండి అనుష్కతో కసరత్తులు చేయిస్తున్న దృశ్యాలతో ఓ వీడియోను వదిలింది సైజ్ జీరో టీం. ఇందులో అనుష్క ట్రైనప్ అవుతున్న విజువల్స్‌ ను సైజ్ జీరో సినిమా కోసం కూడా వాడుకున్నారు. ఇప్పటికే 10 కిలోలు తగ్గిన అనుష్క.. బాహుబలి-2 కోసం ఇంకా ఏడెనిమిది కిలోలు తగ్గాలనంటోంది.
Tags:    

Similar News