61 గంటలు బ్లాక్ .. వాట్సాప్‌పై సోనూసూద్ ఫైరింగ్

అంతకుముందు సోనూ సీరియ‌స్ అవుతూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా రాసాడు.

Update: 2024-04-28 11:37 GMT

సోనూ సూద్ తీవ్రంగా హ‌ర్ట‌య్యాడు. క‌ల‌త‌కు గుర‌య్యాడు. 9,483 సందేశాలు చ‌ద‌వ‌లేక‌పోయాడు.. 61 గంటల పాటు వాట్సాప్ బ్లాక్ అయింది. దీంతో అత‌డు అగ్గిమీద గుగ్గిల‌మే అయ్యాడు. తన చిత్రం `ఫతే` విడుదల ప్ర‌చారంలో ఉన్న సోనూ సూద్ వాట్సాప్ మెసేజింగ్ యాప్ బ్లాక్ అవ్వ‌డంపై క‌ల‌త‌కు గురయ్యాడు. 61 గంటల తర్వాత చివరకు తన వాట్సాప్‌కు తిరిగి యాక్సెస్‌ను పొందాడు.

అంతకుముందు సోనూ సీరియ‌స్ అవుతూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఇలా రాసాడు. వాట్సాప్ ఖాతా దాదాపు 60 గంటల పాటు బ్లాక్ అయిందని వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌కు విజ్ఞప్తి చేశాడు. సహాయం కోసం అవసరమైన వ్యక్తులు న‌న్ను సంప్రదించారు అంటూ బాధతో విజ్ఞప్తులు చేసాడు.

ఆదివారం నాటికి స‌మ‌స్య తొల‌గిపోయింది. సోనూ తన ఖాతా స్థితి గురించి రివీల్ చేస్తూ తన 27.7 మిలియన్ల ఫాలోవర్లను మరోసారి అప్‌డేట్ చేశాడు. 61 గంటల వ్యవధిలో తనకు 9,000కు పైగా చదవని సందేశాలు ఉన్నాయని సోనూ తెలిపాడు. ``ఎట్టకేలకు నా వాట్సాప్‌ని తిరిగి పొందారు. 61 గంటల్లో కేవలం 9,483 చదవని సందేశాలున్నాయి... ధన్యవాదాలు`` అని రాశారు. ఇంతకుముందు X (గతంలో Twitter) ``నా నంబర్ @WhatsAppలో పని చేయడం లేదు. నేను ఈ సమస్యను చాలాసార్లు ఎదుర్కొంటున్నాను. మీరు మీ సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి ఇది సమయం అని నేను భావిస్తున్నాను`` అని ఫిర్యాదు చేసారు.

Read more!

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సోనూ సూద్ త‌దుప‌రి `ఫతే` చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జాక్వెలీన్ ఫెర్నాండెజ్ క‌థానాయిక‌. సోనూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి సాగర్ ప్రొడక్షన్స్ - జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం సైబర్ క్రైమ్ తాలూకా సంక్లిష్టతలు సవాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ నిపుణుడు లీ విట్టేకర్ పర్యవేక్షణలో కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెర‌కెక్కించారు. ఫ‌తే ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News