బాబాయ్ పిలిచాడా? డాడీ వెళ్ల‌మ‌న్నాడా?

మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ రెండు రోజులుగా పిఠాపురంలో బాబాయ్ ప‌వ‌న్ కళ్యాణ్ త‌రుపున ప్ర‌చారం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-04-28 17:30 GMT

మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ రెండు రోజులుగా పిఠాపురంలో బాబాయ్ ప‌వ‌న్ కళ్యాణ్ త‌రుపున ప్ర‌చారం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ ఎంట్రీతో ఒక్క‌సారిగా పిఠాపురం ప్ర‌జ‌లు షాక్ అయ్యారు. క‌నీసం ప్ర‌చారం లో కూడా వ‌రుణ్ పేరు లేదు? అలాంటింది స‌డెన్ గా ప‌ర్య‌టించే స‌రికి ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌కొస్తుంది. ఇంకాస్త లోతుగా వెళ్తే వ‌రుణ్ ని ఇంత దూరం రావ‌డానికి కార‌ణం ప‌వన్ క‌ళ్యాణ్ పిలుపు మేర‌కా? లేక వ‌రుణ్ సొంత నిర్ణ‌యంతో సైనికుడిలా బ‌రిలోకి దిగాడా? అన్న‌ది అతి పెద్ద సందేహం.

ఎందుకంటే ప‌వ‌న్ పిల‌వాలేగానీ వ‌చ్చి రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన‌ర్లం అవుతామ‌ని మెగా హీరోలంతా గంపా గుత్తుగా ప్రామిస్ చేసారు. కానీ ప‌వ‌న్ ఎవ‌రిని వ‌చ్చి త‌న త‌రుపున ప్ర‌చారం చేయండి అని అడ‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో వ‌రుణ్ తేజ్ త‌ల్లితో క‌లిసి రావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. పిఠాపురంలో పూజ‌లు అనంత‌రం వ‌రుణ్ ప్ర‌చారం మొద‌లైంది. మ‌రి వ‌రుణ్ త‌న‌కు తానుగా బాబాయ్ త‌రుపున సైనికుడిగా వ‌చ్చాడా? ప‌వ‌న్ పిలిస్తే వ‌చ్చాడా? అన్న‌ది తేలాలి. ఒక వేళ ప‌వ‌న్ పిలిస్తే గ‌నుక వ‌రుణ్ ఒక్క‌డినే ఎందుకు పిలుస్తాడు? మెగా ఫ్యామిలీ లోమిగ‌తా హీరోల్ని కూడా పిలిచే ఉంటాడు? క‌దా? అని సందేహిస్తున్నారు.

Read more!

ఒక‌వేళ అదే జ‌రిగితే వాళ్లంతా కూడా మే 10 లోపు పిఠాపురం వ‌చ్చి ప్ర‌చారం చేస్తారు. ఒక‌వేళ పిల‌వ‌లేదు అంటే గెట‌ప్ శ్రీను..హైప‌ర్ ఆది.. రాం ప్ర‌సాద్ లో స్వ‌చ్ఛందంగా వ‌చ్చి ప్ర‌చారం చేయాలి. మ‌రి అందుకు మెగా హీరోలు సిద్దంగా ఉన్నారా? అన్న‌ది చూడాలి. ఇక వ‌రుణ్ విష‌యానికి వ‌స్తే అత‌డ తండ్రి నాగ‌బాబు పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పార్టీ త‌రుపున అత‌డికి టికెట్ ఇవ్వొచ్చ‌ని భావించారు గానీ అది సాధ్య‌ప‌డ‌లేదు. అప్ప‌టి నుంచి నాగ‌బాబు పెద్ద‌గా యాక్టివ్ గా క‌నిపించ‌లేదు. అలాగ‌ని దూరంగా జ‌రిగాడ‌ని కాదు...అవ‌స‌రం మేర స్పందిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో వ‌రుణ్ ని తానే వెళ్లి ప్ర‌చారం చేయ్ అని పంపించారా? అన్న‌ది మ‌రో సందేహం. ఇక రాజ‌కీయ ప్ర‌సంగాల్లో వ‌రుణ్‌కి ఎలాంటి అనుభ‌వం లేదు. సినిమా స‌భ‌ల్లోనే అతి క‌ష్టం తో కిందా..మీదా ..సిగ్గు ప‌డుతూ మాట్లాడుతాడు. అలాంటి వ‌రుణ్ ఓట‌ర్ల‌లో బాబాయ్ కి ఓటు వేయండ‌ని ఎంత వ‌ర‌కూ చైత‌న్య ప‌రిచాడో చూడాలి. ఇప్ప‌టికే వ‌రుణ్ ప్ర‌చారానికి సంబంధించిన వీడియోలు..షాట్స్ నెట్టింట వైర‌ల్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుణ్ రాక‌తో భారీ ఎత్తునా అత‌న్ని చూడ‌టానికి జ‌నాలు త‌ర‌లి వ‌స్తున్నారు. గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ స‌మ‌యంలో మెగా హీరోలు ప్ర‌చారానికి వ‌చ్చిన‌ప్పుడు ఇలాంటి స‌న్నివేశ‌మే క‌నిపించింది.

Tags:    

Similar News