రానా కూడా అదే బిజినెస్ చేస్తాడటగా..

Update: 2016-08-23 13:30 GMT
టాలీవుడ్ ఆజానుబాహుల్లో రానా దగ్గుబాటి కూడా ఒకడు. మనోడు బాహుబలి సినిమాలో బల్లాలదేవ క్యారెక్టర్ రక్తికట్టించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. దానికితోడు హీరోకు ధీటైన పర్సనాలిటీతో అదరగొట్టేవాడు. ఒక ప్రక్కన వంశ్యపార్యపరంగా వచ్చే రామానాయుడు స్టూడియో ఉంది.. మరో ప్రక్కన సొంతంగా యాక్టింగ్ కెరియర్ కూడా ఉంది.. అయినాసరే ఇప్పుడు రానా మరో కొత్త బిజినెస్ లోకి అడుగుపెడుతున్నాడని తెలుస్తోంది.

మొన్నటికి మొన్న టాలీవుడ్ డ్యాషింగ్ దర్శకుడు పూరి జగన్ ఒక కొత్త బిజినెస్ పెట్టాడు. ఎలాగో ముంబయ్ నుండి చాలామంది భామలను తన సినిమాల ద్వారా పరిచయం చేస్తున్నాడు కాబట్టి.. ఇప్పుడు ఆ పరిచయ వేదికను కాస్త పెద్దదిగా చేసి.. ''పూరి కాన్సెప్ట్స్ '' అంటూ ఒక టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్థాపించాడు. ఛార్మి ఆ కంపెనీ యవ్వారాలను చూసుకుంటోంది. అంతకంటే ముందే ఆన్ లైన్ లో ఇలాంటి ఒక ఏజెన్సీ స్టార్ట్ చేశాడు జగపతి బాబు. ఇక ఇప్పుడు రానా కూడా అదే బాటలో ప్రయాణించి.. మనోడు కూడా ఒక టాలెంట్ మేనేజ్మెంట్ ఏజన్సీ స్టార్ట్ చేస్తున్నాడట. ఇది చాలా లాభదాయకమైన బిజినెస్ అనుకుంట.. అందుకే అందరూ ఆ ఏజన్సీలే పెడుతున్నారు.

మామూలుగా టాలీవుడ్ లో ఒకరు ఏదైనా మొదలెడితే.. అందరూ అదే ఫాలో అవుతుంటారు. ఆ కాన్సెప్టు విసిగివేసారి పోయేవరకు అందరూ అదే చేస్తారు. ఆ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజన్సీలు అలా కాకూడదని ఆశిద్దాం.

Tags:    

Similar News