హరిహర వీరమల్లు.. ఈ అప్ డేట్ ట్విస్ట్ ఊహించలేదు

కానీ అసలు కారణం ఏమిటో గాని సినిమా షూటింగ్ అయితే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది.

Update: 2024-04-30 08:27 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను ఎ ఏ క్షణంలో మొదలు పెట్టాడో కానీ ఆ సినిమాకు మొదట్లో ఎంత హైప్ వచ్చిందో అంతే వేగంగా అంచనాలను తగ్గించేసుకుంది. దర్శకుడు క్రిష్ ఎలాగైనా ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్కయ్యేలా చేయాలి అని గట్టిగానే ప్రయత్నాలు చేశాడు. కానీ అసలు కారణం ఏమిటో గాని సినిమా షూటింగ్ అయితే చాలాసార్లు వాయిదా పడుతూ వస్తోంది.

ఒకవైపు పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా హఠాత్తుగా మార్పులు చేయడం వలన సినిమాకు చాలా సార్లు బ్రేకులు పడ్డాయి. ఇక ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నిర్మాత రత్నం మాత్రం అసలు ఈ సినిమాను వదలడం లేదు. కచ్చితంగా సినిమాను గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.

ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల అనంతరం ఈ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇక ఎవరు ఈ సినిమా గురించి మర్చిపోకుండా చేయాలి అని నిర్మాత సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా హడావుడి చేస్తూనే ఉన్నారు. ఇక దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పకున్నారా అనే సందేహాలు అయితే చాలాసార్లు వినిపించాయి. ఎందుకంటే అతను హఠాత్తుగా అనుష్కతో కొత్త సినిమా స్టార్ట్ చేయడంతో హరిహర వీరమల్లు సినిమా మరో డైరెక్టర్ చేతిలోకి వెళ్లిపోతుందేమో అనే విధంగా గుసగుసలు వినిపంచాయి.

Read more!

అయితే ఇందులో నిజం లేదు అని నిర్మాత రత్నం అప్పట్లోనే ఒక క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు రాబోయే అప్డేట్ కు సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేయగా అందులో దర్శకుడి పేరు కనిపించలేదు. దీంతో మళ్ళీ ఈ విషయంపై ఒక్కసారిగా డౌట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇక మేకర్స్ నుంచి అందుతున్న ప్లాన్ ప్రకారం అయితే ఈ పోస్టర్ లో క్రిష్ పేరు కనిపించకపోయినా వచ్చే అప్డేట్ లో మాత్రం క్రిష్ పేరు ఉంటుంది అని చెబుతున్నారు.

అసలు ఈ పోస్టర్ లో క్రిష్ పేరు ఎందుకు మిస్సయ్యింది అనే విషయంలో సరైన క్లారిటీ లేదు. మే 2వ తేదీన ఉదయం 9 గంటలకు సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు. ధర్మం కోసం యుద్ధం.. అంటూ పోస్టర్ లో ఒక మంచి క్యాప్షన్ కూడా ఇచ్చారు. మరి రాబోయే అప్డేట్ ఈ సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా సన్నీ డియోల్ పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు.

Tags:    

Similar News