రానా కోసం వెయిట్ చేయడం వల్లే ఈ గ్యాప్
అడవి శేషు.. అదాశర్మ.. అనసూయ కీలక పాత్రల్లో నటించిన క్షణం చిత్రంకు మంచి టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. క్షణం చిత్రం ఇతర భాషల్లో కూడా రీమేక్ అయ్యింది. అలాంటి క్షణం చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు రవికాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏకంగా నాలుగు సంవత్సరాలు తీసుకున్నాడు.
ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండవ సినిమా ‘కృష్ణ అండ్ ఇజ్ లీలా’ చిత్రం తాజాగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రివ్యూలు కూడా పాజిటివ్ గానే వస్తున్నాయి. నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినా మళ్లీ సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు రవికాంత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాలుగు సంవత్సరాల గ్యాప్ పై స్పందించాడు.
ఇంటర్వ్యూలో రవికాంత్ మాట్లాడుతూ... క్షణం చిత్రం విడుదలైన వెంటనే రానాతో ఒక సినిమా అనుకున్నా. కథ కూడా సిద్దం చేశాను. కాని ఆ స్క్రిప్ట్ రానాకు నచ్చలేదు. మళ్లీ రానా కోసం వెయిట్ చేసి స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈసారి స్క్రిప్ట్ నచ్చిన రానా తాను నటించకుండా నిర్మించేందుకు ఓకే చెప్పాడు. అలా ఆయన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుని వెయిట్ చేస్తే ఆయన నిర్మాణంలో ఈ సినిమా చేసే అవకాశం వచ్చిందని రవికాంత్ అన్నాడు. మళ్లీ రానా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తానంటూ ఆయన పేర్కొన్నాడు. ఈ చిత్రం సక్సెస్ టాక్ దక్కించుకున్న కారణంగా ఈసారి రవికాంత్ కు వెంటనే రానా ఓకే చెప్పే అవకాశం ఉంది.