ట్రైలర్ టాక్: దేశం కోసం రానా వార్

Update: 2017-01-11 08:27 GMT
1971 యుద్దంలో.. పాకిస్తాన్ మన దేశపు వెన్నెముకను విరిచేయాలని.. భారత సముద్రంలో విశాఖపట్నం తీరంలో ఉన్న ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ ను నాశనం చేయాలని ఘాజీ అనే సబ్ మెరైన్ పంపారు. దానిని భారతదేశం ఎలా నాశనం చేసిందనే కథాంశంతో ''ఘాజీ'' సినిమాను దించుతున్నాడు దగ్గుబాటి రానా. ఈ సినిమా ట్రైలర్ ఈరోజే విడుదలైంది.

సంకల్ప్ రెడ్డి అనే నూతన డైరక్టర్ తీసిన ఈ వార్ సినిమాలో.. రానా ఒక నావల్ ఆఫీసర్ గా కనిపించాడు. పాకిస్తాన్ ఎటాక్ చేస్తుందని తెలుసుకున్న ఇండియన ఆర్మీ.. నావీ.. ఇంటెలిజనస్స్ వ్యవస్థలు ఆనాడు ఎలా స్పందించాయి.. ఎలా పాక్ వ్యూహాన్ని తిప్పికొట్టాయి.. అనే కథాంశాన్ని బాగానే చిత్రీకరించారు. మొత్తంగా గ్రాఫిక్స్ మీదనే ఆధారపడిన ఈ సినిమాలో దేశం కోసం త్యాగం చేసే పాత్రల్లో కెకెమీనన్.. ప్రకాష్‌ రాజ్.. ఇలా చాలామందే నటించారు. అలాగే పాకిస్తాన్ సబ్ మెరైన్ నుండి బయటకొచ్చే ఒక శరణార్దిగా తాప్సీ కనిపించింది. మొత్తంగా ఇలాంటి సినిమాలు ఇప్పటివరకు కేవలం హాలీవుడ్ లోనే చూసిన మనం.. ఇప్పుడు మన నటులతో.. మన తెలుగులో.. మనం తెరపై మనం చూడటం అద్భుతమనే చెప్పాలి.

ఈ సినిమా ఫిబ్రవరిలో రానుండటం.. పైగా హిందీలో స్వయంగా కరణ్‌ జోహార్ రిలీజ్ చేస్తుండటంతో.. సినిమా చుట్టూ విపరీతమైన హైప్ వచ్చే ఛాన్సుంది. అది సంగతి.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News