సోగ్గాడి బయోపిక్‌ లో భల్లాలదేవుడు

Update: 2020-10-12 09:15 GMT
ఈ మద్య కాలం లో వరుసగా బయోపిక్‌ లు వస్తున్నాయి. సినిమా పరిశ్రమకు చెందిన వారు రాజకీయ నాయకుల బయోపిక్‌ లు ఇంకా క్రీడారంగానికి చెందిన వారి బయోపిక్‌ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు లో సోగ్గాడి గా గుర్తింపు దక్కించుకున్న శోభన్‌ బాబు బయోపిక్‌ కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలా సింపుల్‌ గానే శోభన్‌ బాబు జీవితం సాగింది. ఆయన సినీ కెరీర్‌ లో కూడా టర్నింగ్‌ లు మలుపులు షాక్‌ లు వంటివి ఏమీ లేవు. అయినా కూడా ఆయనపై తెలుగు వారికి ఉన్న అభిమానంను క్యాష్‌ చేసుకునేందుకు ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ ఒకరు ఆయన బయోపిక్‌ ను చేయాలని భావిస్తున్నాడట.

ఆ బయోపిక్‌ ను రానా తో చేయాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నాడట. శోభన్‌ బాబు పాత్రకు రానా అయితే అన్ని విధాలుగా సెట్‌ అవుతాడు అంటూ బయోపిక్‌ ను ప్లాన్‌ చేస్తున్న వారు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఖచ్చితంగా ఈ సినిమాను రానా చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. రానా నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే రానా 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ లో చంద్రబాబు నాయుడు పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు. ఈసారి పూర్తి స్తాయిలో బయోపిక్‌ ను చేసేందుకు ఓకే చెప్తాడా అనేది చూడాలి.
Tags:    

Similar News