ఇస్తా.. మొత్తం తిరిగిచ్చేస్తా : RAPO
ఫాన్స్ తమ అభిమాన హీరోల బర్త్ డే వచ్చిందంటే వారు చేసే హంగామా అంతా ఇంతా కాదు. వారి పుట్టిన రోజుని పండగలా భావిస్తుంటారు. పెద్ద పెద్ద కటౌట్లు.. బ్యానర్లు.. ప్లెక్సీలు.. కేక్ కటింగులు అంటూ హడావిడి చేస్తూ ఉంటారు. తమ హీరోని మెప్పించడానికి ఎన్ని చేయాలో అన్ని చేస్తుంటారు అభిమానులు. తమ ఫేవరెట్ హీరో ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని ఫ్యాన్స్ కటౌట్లు ముందు బర్త్ డే వేడుకలు జరుపుతూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. హీరోలు సైతం వారి ప్రేమాభినాలకు పొంగి పోతుంటారు. అప్పుడప్పుడు ఎమోషనల్ కూడా అవుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో కూడా అలానే ఎమోషనల్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ పోతినేని. ‘దేవదాసు’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రామ్.. మొదటి సినిమాతోనే డాన్సులు ఫైట్స్ నటనతో ఈ కుర్ర హీరోలో ఏదో మ్యాజిక్ ఉందే అని తెలుగు ప్రేక్షకులు అనుకునేలా చేసాడు. ఆ తర్వాత ‘రెడీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నాడు. 'మస్కా' 'కందిరీగ' 'పండగ చేస్కో' 'నేను శైలజ' సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా రామ్ కు మాస్ లో మంచి ఫాలోయింగ్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే.. ఇస్మార్ట్ శంకర్ మూవీ మరొక ఎత్తు అని చెప్పొచ్చు.
ఇదిలా ఉండగా నిన్న రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'రెడ్' చిత్రం నుంచి మాస్ బీట్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో మణి శర్మ మాస్ బీట్.. రామ్ డ్యాన్స్.. హెబ్బా పటేల్ అందాలు హైలెట్ గా నిలిచాయి. ఇకపోతే రామ్ పుట్టిన రోజును ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద పండుగలా జరిపారు. సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఫుల్ ట్రెండ్ చేసారు. దీంతో రామ్ పోతినేని తన ఫ్యాన్స్ కి కృతజ్ఞతలు చెప్తూ ఎమోషనల్ ట్వీట్ చేసాడు. ''నా ప్రియమైన అభిమానులారా.. మీరంతా నాకు ఉన్నారని ఈ ప్రపంచం తెలుసుకునేలా చేసేందుకు మీరు నా కోసం తిండి తినలేదని కనీసం రాత్రంతా నిద్ర కూడా పోలేదని నేను విన్నాను.. నిజంగా టచ్ చేశారు.. మీ అందరూ ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇస్తా.. మొత్తం తిరిగి ఇచ్చేస్తా.. ఎందుకంటే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కాబట్టి' అని ట్వీట్ చేశాడు. దీనికి రామ్ అభిమానులు కూడా అదే రేంజ్ లో ఎమోషనల్ రిప్లై ఇస్తున్నారు.