నాలుగేళ్ల కష్టానిదా? ఆరు నెలల శ్రమదా? ఫలితం!
పాన్ ఇండియాలో రెండు భారీ చిత్రాలు `టాక్సిక్`..`ధురందర్ 2` రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.;
పాన్ ఇండియాలో రెండు భారీ చిత్రాలు `టాక్సిక్`..`ధురందర్ 2` రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. రెండు చిత్రాలు మార్చి 19న పోటా పోటాగా రిలీజ్ అవుతున్నాయి? అన్నది ఒక వెర్షన్ అయితే? `టాక్సిక్` వాయిదా పడుతుందనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. `ధురంధర్ 2` విషయంలో కూడా బాలీవుడ్ మీడియాలో వాయిదాకు అవకాశం ఉందనే కథనాలు వెలువడుతున్నాయి. రిలీజ్ వెనకా? ముందా? అన్నది పక్కన బెడితే?
ఈ రెండు సినిమాల్లో ఏది భారీ విజయం సాధిస్తుంది? అన్నదే ఆసక్తికరం. ఈ రెండు సినిమాల బడ్జెట్లు వేర్వేరు. సినిమా పూర్తి చేయడానికి పట్టిన కాలం మధ్య కూడా వ్యత్యాసం ఉంది. ఓసారి ఆ వివరాల్లో వెళ్తే యష్ కథానాయికగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన `టాక్సిక్` నిర్మాణానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఈ సినిమా షూటింగ్ అధికారికంగా 2024 ఆగస్టు లో బెంగళూరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బెంగళూరు, ముంబై, గోవా, జైపూర్ వంటి ప్రాంతాల్లో సుదీర్ఘంగా చిత్రీకరణ జరిపారు. ముఖ్యంగా ముంబైలో జరిగిన 45 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ అత్యంత కీలకం. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ జె.జె. పెర్రీ పర్యవేక్షణలో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు.
ప్రధాన చిత్రీకరణ అంతా 2025 అక్టోబర్ నాటికి పూర్తయింది. అటుపై పోస్ట్ ప్రొడక్షన్ , గ్రాఫిక్స్ పనుల కోసం మరికొన్ని నెలలు సమయం తీసుకున్నారు. సెట్స్ కు వెళ్లక ముందు ఈ సినిమా కోసం మరో రెండేళ్ల పాటు శ్రమించారు. ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తే బాగుంటుందని యశ్-గీతూ మోహన్ దాస్ చాలా రీసెర్చ్ చేసారు. రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిద్య ధర్ `ధురందర్` ని రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు ముందే ప్రకటించారు. ఈ సినిమాను మొదటి భాగంతో కలిపి బ్యాక్-టు-బ్యాక్ చిత్రీకరించారు. దీనివల్ల షూటింగ్ సమయం చాలా వరకు ఆదా అయ్యింది.
2024 జూలై థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ప్రారంభమైంది. ప్రధాన చిత్రీకరణ అక్టోబర్ 2025లోనే పూర్తయింది. అనంతరం మొదటి భాగాన్ని గత ఏడాది ముగింపులో రిలీజ్ చేసారు. అప్పుడే రెండవ భాగాన్ని మార్చి 19న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రెండవ భాగం కూడా షూటింగ్ పూర్తవ్వడంతోనే ధీమాగా ప్రకటించారు. మొత్తంగా `ధుంరధర్` షూటింగ్ నెలల వ్యవధిలోనే పూర్తి చేసారు. `టాక్సిక్` మాత్రం సంవత్సరాలు సమయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఈ రెండు సినిమా ఫలితాలు ఎలా ఉంటాయి? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎప్పుడు రిలీజ్ అయినా? ఉత్తమ ఫలితాలు సాధించే చిత్రం ఏదవుతుంది? అంటూ సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది.