'మేం ఆస్తులు సంపాదించేలా చేయండి'.. బన్నీ వాసు కామెంట్స్ వైరల్

ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాసు మాట్లాడుతూ సినిమాపై పూర్తి నమ్మకం ఉందన్నారు.;

Update: 2026-02-25 09:53 GMT

సీనియర్ నటుడు శివాజీ లీడ్ రోల్ లో నటిస్తూ స్వయంగా నిర్మించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ మూవీ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఎంటర్టైన్మెంట్, సస్పెన్స్‌, కామెడీ ఎలిమెంట్స్ తో రూపొందిన ఆ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా, హీరోయిన్‌ గా లయ నటించారు. కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యేలా సరికొత్త స్టోరీతో సినిమాను రూపొందించినట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

ఈటీవీ విన్ సమర్పణలో రూపొందిన ఆ మూవీ.. మొదటగా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రేక్షకులు సిల్వర్ స్క్రీన్ పై మరింత ఎంజాయ్ చేస్తారనే నమ్మకంతో మార్చి 6న థియేటర్లలో గ్రాండ్‌ గా రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. విడుదల బాధ్యతలు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు బన్నీ వాసు, వంశీ నందిపాటి చేపట్టారు.

ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం హైదరాబాద్‌ లో ప్రెస్‌మీ ట్ నిర్వహించింది. ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాసు మాట్లాడుతూ సినిమాపై పూర్తి నమ్మకం ఉందన్నారు. మంచి కంటెంట్‌ తో తీసిన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం తమ బాధ్యత అని తెలిపారు. గత ఏడాది నుంచి ఈటీవీ విన్‌తో కలిసి ప్రయాణం కొనసాగుతోందని, ఆ రిలేషన్ భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నామని చెప్పారు.

"ముందు ఈటీవీ ఉంటే.. వెనుక బన్నీ వాసు, వంశీ నందిపాటి ఏడాది నుంచి వెళ్తున్నాం. ఫ్యూచర్ లో ఆ జర్నీ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నా. వాళ్ళు కష్టపడి సినిమాలు తీస్తున్నారు.. మేము వాటిని రిలీజ్ చేసి బాగా సంపాదించుకుంటున్నాం. ఇది చాలా బాగుంది.. చాలా హ్యాపీగా కూడా ఉంది. అందుకే మమ్మల్ని వదలకుండా ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నా" అని బన్నీ వాసు తెలిపారు.

"మాకు నాలుగు డబ్బులు ఇచ్చి.. చక్కగా ఆస్తులు సంపాదించేలా చేయాలని కోరుకుంటున్నా. ఏ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత కూడా అడ్డు రాకుండా ఈటీవీతో మా ప్రయాణం సాగేలా దీవించాలని కోరుకుంటున్నా.. లోపల బాధ ఉన్నా కూడా ఆశ్వీరదించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను" అని తెలిపారు బన్నీ వాసు. ప్రస్తుతం ఆయన కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఈటీవీ విన్ సమర్పణలో వచ్చిన వివిధ సినిమాలను వంశీ నందిపాటితో కలిసి బన్నీ వాసు.. థియేటర్స్ లో రిలీజ్ చేశారు. లిటిల్ హార్ట్స్ సహా పలు చిత్రాలతో సూపర్ హిట్స్ కూడా అందుకున్నారు. మంచి లాభాలను సంపాదించుకున్నారు. ఇప్పుడు సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మూవీ విషయంలో కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని ఆశిస్తున్నారు. మరి ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News