పవన్ పై వర్మ సర్వే ఏం తేల్చిందంటే..

Update: 2016-02-10 07:15 GMT
రామ్ గోపాల్ వర్మకు డైరెక్టర్ ఎంత గొప్ప పేరుందో వివాదాల విషయంలో అంతే క్రెడిట్ ఉంది. వివాదాస్పద అంశాలపై కామెంట్స్ చేయడం, ఏదీ దొరక్కపోతే తానే వివాదాలు సృష్టించడం వర్మకు బాగా అలవాటు. తన గురించి నలుగురూ మాట్లాడుకోవడానికో, తన మూవీ ప్రచారానికో ఏ టాపిక్ ని అయినా సరే వాడేయగలడు వర్మ. ఇప్పుడీ డైరెక్టర్ టార్గెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే ఉంది.

ఈయన కులాల కాన్సెప్ట్ తో సినిమా తీయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి పవన్ గురించి ఏదో ఒక కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పవన్ గురించి ఓ సర్వే కూడా చేసేశాడు. 'జనసేన స్పీచ్ తర్వాత పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరుస్తున్నాడా?' అన్నదే వర్మ సర్వే. ఈ ఆన్ లైన్ ఓటింగ్ సర్వేకి స్పందన బాగానే వచ్చింది. ఏకంగా 9400మంది పాల్గొన్న ఈ సర్వేలో.. 64శాతం మంది పవన్ నిరుత్సాహపరిచాడనే తేల్చారు. ఒకవైపు పవన్ గురించి సర్వే చేయడానికి వర్మకి ఏం పని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఒకవేళ పవన్ కి  పాజిటివ్ గా రిజల్ట్ ఉంటే ఇలా మాట్లాడేవాళ్లు కాదు కదా అన్నది ఒక యాంగిల్.

తుని కాపు గర్జన తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించినపుడు కూడా వర్మ.. ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలే చేశాడు. అసలు పవన్ ఏం మాట్లాడాడో  పవన్ కైనా అర్ధమయిందా అని ప్రశ్నించి.. అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అంతా బాగానే ఉంది కానీ.. ఈయన కామెంట్స్ కరెక్ట్ కాదంటే.. వాళ్లసలు పవన్ కి నిజమైన ఫ్యాన్స్ కాదనడమే విచిత్రంగా ఉంది.
Tags:    

Similar News