అప్పుడు జూనియర్‌ ఆర్టిస్టు ఇప్పుడు డైరెక్టర్‌

Update: 2019-06-24 16:47 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ స్కూల్‌ నుండి ఎంతో మంది దర్శకులు పరిచయం అయ్యారనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన శిష్యులు ఎంతో మంది స్టార్‌ డైరెక్టర్స్‌ అయ్యారు. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ కూడా ఒకప్పుడు రామ్‌ గోపాల్‌ వర్మ శిష్యుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన శిష్యులను అన్ని విధాలుగా వర్మ వాడుతూ ఉంటాడు. శివ హిందీ రీమేక్‌ సమయంలో జూనియర్‌ ఆర్టిస్టుగా శిష్యుడు పూరి జగన్నాధ్‌ ను కూడా తీసుకున్నాడు.

తెలుగులో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 'శివ' చిత్రం రీమేక్‌ తో హిందీలో వర్మ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలోనే ఒక పాట చిత్రీకరణ సమయంలో జూనియర్‌ ఆర్టిస్టు తక్కువ ఉన్న కారణంగానో లేదా మరేంటో కాని పూరి జగన్నాధ్‌ తో కూడా స్టెప్పులు వేయించాడు. ఇప్పుడు ఆ విషయాన్ని వర్మ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకున్నాడు. ఒకప్పుడు జూనియర్‌ ఆర్టిస్టు ఇప్పుడు డైరెక్టర్‌ అంటూ వర్మ పోస్ట్‌ చేశాడు.

వర్మ ట్వీట్‌ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో డాన్స్‌ చేస్తున్న నీలి రంగు షర్టు వ్యక్తిని నేనేనంటూ పూరి రీ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం చేస్తున్న పూరికి ఇలా వర్మ సర్‌ ప్రైజ్‌ ఇవ్వడం జరిగింది.


Full View
Tags:    

Similar News