వివాదాలతో సహజీవనం చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మ భారీ తప్పే చేశారు. ఒకరికి పాపులార్టీ తీసుకురావటం కోసం మరొకరిని బలిపశువు చేయటం ఏ మాత్రం లాజిక్కు లేని వ్యవహారం. అయితే.. కేవలం తన స్వార్థమే తప్పించి మరింకేమీ కాదన్నట్లుగా వ్యవహరించే వర్మ.. ఎప్పటికప్పుడు తాను చేసే పనులకు తనదైన శైలిలో లాజిక్కులు చెప్పుకోవటం కనిపిస్తుంటుంది.
పవన్ పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఓపక్క సంచలనం సృష్టిస్తే.. మరోపక్క శ్రీరెడ్డి మాటల వెనుక తన సలహానే ఉందంటూ వర్మ ఓపెన్ గా ఒప్పుకోవటంతో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఒక ప్రముఖ దర్శకుడు.. ఒక నటికి పాపులార్టీ తేవటం కోసం ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధం లేని ఒక మహిళను ఉద్దేశించి అసభ్యంగా.. అత్యంత దారుణంగా వ్యాఖ్యలు చేయటం ఏమిటన్న షాక్ పలువురిని తొలిచేస్తోంది.
వర్మ తీరును ఇప్పటికే పలువురు తప్పు పట్టటం.. అందుకు స్పందించిన వర్మ సారీ చెప్పటం తెలిసిందే. తానిక ఎప్పుడూ పవన్ మీద కామెంట్లు చేయనని.. తన తల్లి మీద మొదటిసారి ప్రమాణం చేస్తున్నట్లుగా చెప్పుకున్నారు. అయినప్పటికీ పవన్ కూల్ కాలేదు. వర్మతో సహా పలువురు మీడియా అధినేతలపై పలు ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేసిన పవన్.. ఫిలింఛాంబర్లో నిరసన చేపట్టే ప్రయత్నం చేసినట్లుగా చెబుతున్నారు.
తన తల్లిని దారుణంగా అవమానించిన విషయంలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక వర్మ ఉన్నానని తనకు తాను ప్రకటించిన నేపథ్యంలో.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పవన్ పట్టుపట్టినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. పవన్ కు మద్దతుగా నిలుస్తున్నారు పలువురు టాలీవుడ్ ప్రముఖులు. వర్మకు సన్నిహితుడు.. ఆయనకు శిష్యుడుగా చెప్పుకునే పూరీజగన్నాథ్ సైతం స్పందిస్తూ పవన్ కు మద్దతు పలుకుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను సమాధానంగా వర్మ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మరోసారి వర్మ సారీ చెప్పారు.
మీ మనోభావాలను అర్థం చేసుకున్నా.. తప్పు చేశా.. ఇప్పటికే క్షమాపణలు చెప్పాను సార్ అంటూ వర్మ ట్వీట్ చేశారు. చేయకూడని తప్పు చేసేసి.. సారీ చెప్పేస్తే సరిపోతుందా? అన్నది ప్రశ్న. ఎవరికి వారు వెనుకా ముందు చూసుకోకుండా అనేసి సారీ చెప్పటం కొంతలో కొంత ఫర్లేదనుకున్నా..కావాలని ప్లాన్ వేసి మరీ డ్యామేజ్ చేయాలన్న కుట్రకు సారీ సరిపోతుందా?