వహ్వా.. వహ్వా.. వర్మాజీ..!

Update: 2015-05-23 07:30 GMT
విలక్షణ సినిమాతో కెరీర్ ఆరంభించి వివాదాలతో గుర్తింపు పొందారు రామ్ గోపాల్ వర్మ. సినిమా కథ చెప్పి టైటిల్ ప్రకటించిన దగ్గరనుండి విడుదలయ్యే వరకూ అయన సినిమా ప్రచారానికి కొడువుండదు. ఇంకా చెప్పాలంటే ఆయన సినిమాలకంటే వ్యక్తిగతంగా ఆయనకే ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకూ మాఫియా, థ్రిల్లర్, క్రైమ్, హారర్ వంటి అన్ని జోనర్లలోనూ సినిమాలు తీసినా ఈ సరి తన తిక్కను చూపించకుండా చేసిన సినిమా 365 డేస్.

ఈ సినిమాతో నాలో మార్పు వచ్చిందేమో అని సందేహంగా వుందని రామూజీ చెప్పారు. ఒక రకంగా నిజమే అని చెప్పాలి. ఇప్పటివరకూ వర్మ ఎన్ని సినిమాలు చేసినా దర్శకుడిగానే ఎక్కువ గుర్తింపు వచ్చింది కాని ఈ సినిమాతో మాత్రం వర్మలోని రచయిత గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమా ఆరంభంలో వచ్చే సాండ్ ఆర్ట్ తో నేరేషన్ లో అయితే వర్మలోని రచయితకు వహ్వా.. వహ్వా..  అని అనని వారులేరు. ఆ అయిదు నిమిషాలు త్రివిక్రమ్ సినిమా చూస్తున్నామా అని ప్రేక్షకులకులకు అనిపించిందంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఆ తర్వాత సహజ సంభాషణలతో కొనసాగినా పోసాని పాత్రకు రాసిన మాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చివరాఖరుకి చెప్పొచ్చేది ఏమిటంటే వర్మలోనూ ఓ రచయిత దాగున్నాడు. 365 డేస్ సినిమాతో కాస్త బయటపడ్డాడు.      
Tags:    

Similar News