ఆర్జీవీ సంచలనం..టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేపట్టాల్సిందేనట

Update: 2019-05-30 17:34 GMT
ఏపీలో ఇప్పటికే ఘోర పరాజయంతో డీలా పడిపోయిన తెలుగు దేశం పార్టీని - ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని పిలిచి మరీ కెలికేస్తున్న సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ... తాజాగా మరో సెటైరిక్ ట్వీట్ తో గుల్ల చేేసేశారు. ఇప్పటికే పరాభవ భారంతో బయటకు వచ్చేందుకు కూడా అంతగా ఆసక్తి చూపని చంద్రబాబు... దాదాపుగా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం విజయవాడలో నూతన సీఎంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన వర్మ... ఆ కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కాస్తంత రెస్ట్ తీసుకున్న వర్మ... కాసేపటి క్రితం టీడీపీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

 టీడీపీకి ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయాన్ని అందరూ మర్చిపోవాలంటే... పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలని ఆయన సూచించారు. మునిగిపోతున్న నావ లాంటి టీడీపీని రక్షించ గలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే... అది తారక్ ఒక్కరేనని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగని వర్మ.. తారక్ లో సమరోత్సాహం నింపేలా మరింత ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు తన తాతగారిపై ఏమైనా అభిమానం ఉంటే... వెంటనే టీడీపీని రక్షించే బాథ్యతలు తీసుకోవాలని - ఆ బాధ్యతలను తారక్ తన భుజాలపై వేసుకోవాలని కూడా వర్మ కామెంట్ చేశారు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.

Tags:    

Similar News