'పెద్ది' వెనుక ఢిల్లీ సీక్రెట్ ఏంటి?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో `పెద్ది` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-12-25 04:32 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో `పెద్ది` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ క్లైమాక్స్ కు చేరు కుంది. మ‌రో నెల రోజుల్లో షూట్ మొత్తం పూర్త‌వుతుంది. ప్ర‌క‌టిం చిన‌ట్లు గానే మార్చిలో సినిమా రిలీజ్ అవుతుంది. ఎలాంటి వాయిదాకు అవ‌కాశం లేన‌ట్లే క‌నిపిస్తోంది.అదే జ‌రిగితే మెగా అభిమానుల‌కు అంత‌కు మించిన గొప్ప ట్రీట్ ఏముంటుంది. ఇక ఈ సినిమా షూటింగ్ స్పాట్ విష‌యాల్లోకి వెళ్తే తొలుత ఈ చిత్రం షూటింగ్ క‌ర్ణాట‌క లోని మైసూర్ ప్రాంతంలో తొలి షెడ్యూల్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

అక్క‌డ రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్ స‌హా ప్ర‌ధాన పాత్ర‌ల‌పై కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రించారు. మైసూర్ ప్యాలస్ ముందు కూడా హీరో-హీరోయిన్ పై కాంబినేష‌న్ సీన్స్ చేసారు. అటుపై హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ మొద‌లు పెట్టి ప‌ని చేసారు. ఇక్క‌డా సినిమాకు సంబంధించి చాలా షెడ్యూల్స్ నిర్వ‌హించారు. మ‌ధ్య‌లో మ‌రోసారి మ‌ళ్లీ మైసూరు కూడా వెళ్లొచ్చారు. తొలి షెడ్యూల్ లో పెండింగ్ పెట్టిన స‌న్నివేశాల‌ను ఇలా మ‌ధ్య‌లో క‌వ‌ర్ చేసారు.

ఇదంతా ప‌క్క‌న బెడితే? `పెద్ది` విష‌యంలో ఎక్కువ‌గా హైలైట్ అయ్యే ప్రాంతం ఏది? అంటే రాజ‌ధాని ఢిల్లీ అనే చెప్పాలి.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఢిల్లీలో ఇప్ప‌టికే మూడు సార్లు నిర్వ‌హించారు. హైద‌రాబాద్ లో ఓ క్రికెట్ స్టేడియంలో నైట్ సీన్స్ చేస్తోన్న స‌మ‌యంలో అప్ప‌టిక‌ప్పుడు ఢిల్లీకి వెళ్లి అక్క‌డ లోకేష‌న్స్ లో కుస్తీ పోటీకి సంబం ధించిన స‌న్నివేశాలు షూట్ చేసి వ‌చ్చారు. అక్క‌డా ఓ స్టేడియంలోనే ఈ స‌న్నిశాలు చిత్రీక‌రించ‌డంతో కంటు న్యూటీ స‌న్నివేశాలగా తేలింది. ఆ త‌ర్వాత మ‌రోసారి కూడా ఢిల్లీ వేదిక‌గా మ‌రికొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఈసారి మాత్రం ఢిల్లీ విను వీధుల్లో షూట్ చేసారు. గ్రౌండ్ జోలికి వెళ్ల‌లేదు. ప్ర‌స్తుతం కూడా ఢిల్లీలోనే షూటింగ్ జ‌రు తోంది.

ఈసారి ప్ర‌త్యేకించి అరుణ్ జైట్లీ స్టేడియం, తెలంగాణ భవన్, ఇండియా గేట్ వంటి కీలక ప్రాంతాల్లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అందులోనూ తీవ్ర‌మైన చలి ప్రాంతంలో షూటింగ్ అంటే సాధార‌ణ విష‌యం కాదు. చ‌లి తీవ్ర‌త లేని స‌మ‌ యంలో షూటింగ్ చేసుకునే అవ‌కాశం `పెద్ది` టీమ్ కి ఉంది. కానీ అప్పుడు లైట్ తీసుకుని ఇంత తీవ్ర‌మైన‌ చ‌లిలో షూట్ చేస్తున్నారంటే? ప్ర‌త్యేక కార‌ణం లేకుండా ఉండ‌దు. సినిమాలో ఎంతో ప్ర‌త్యేక‌త ఉంటే గానీ ఢిల్లీ వ‌ర‌కూ వెళ్ల‌రు. హైద‌రాబాద్ లోనే త‌క్కువ ఖ‌ర్చులో ఢిల్లీ లొకేష‌న్స్ సెట్స్ ను వేసి చిత్రీక‌ రించొచ్చు. కానీ ఆ ఛాన్స్ తీసుకోకుండానే మూడు..నాలుగు సార్లు ఢిల్లీ వెళ్లారంటే? సినిమాలో ఢిల్లీ స‌న్నివేశాల‌ ప్ర‌త్యేక‌త హైలైట్ అవుతుంది.

Tags:    

Similar News