50 ఏళ్ల మ‌హేష్ ని క్ష‌మించ‌ని రాజ‌మౌళి!

రాజ‌మౌళితో సినిమా అంటే ఎలా ఉంటుందో? ఆయ‌న‌తో ప‌ని చేసిన హీరోల్ని అడిగితే క‌రెక్ట్ గా చెబుతారు.;

Update: 2025-12-25 04:28 GMT

రాజ‌మౌళితో సినిమా అంటే ఎలా ఉంటుందో? ఆయ‌న‌తో ప‌ని చేసిన హీరోల్ని అడిగితే క‌రెక్ట్ గా చెబుతారు. సినిమా సెట్స్ కు వెళ్లిందంటే? హీరోలంతా రెస్ట్ లెస్ గా ప‌ని చేయాల్సి ఉంటుంది. ఉద‌యం వెళ్లిన హీరోని సాయంత్రం ఎన్ని గంట‌ల‌కు వ‌దులుతారు? అన్న‌ది ఆయ‌నకి కూడా తెలియ‌దు. ఆరోజు షెడ్యూల్ ప్ర‌కారం జ‌క్క‌న్న అనుకు న్నాడంటే? ఆ సీన్స్ పూర్తి చేయాల్సిందే. అవ‌స‌ర‌మైతే హీరోలు కూడా త‌న‌తో పాటు అక్క‌డే నిద్రించాలి. రాజ‌మౌళి ఏ సినిమా మొద‌లు పెట్టినా? ఇల్లు ఒక ద‌గ్గ‌రా? షూటింగ్ మ‌రో ద‌గ్గ‌రా ఉండ‌దు? షూటింగ్ స్పాట్ నే త‌న ఇంటిగా మార్చేసుకుంటారు.

అవ‌స‌ర‌మైతే హీరోలు కూడా త‌న‌లాగే ఉండాల‌ని ఆదేశిస్తారు. త‌న‌కు హీరో అవ‌స‌రాన్ని బ‌ట్టి అక్క‌డ స‌న్నివేశం ఉంటుంది. `బాహుబ‌లి` విష‌యంలో ప్ర‌భాస్, రానా ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డారో వాళ్ల మాట‌ల్లోనే బ‌య‌ట ప‌డింది. ఆ సినిమా షూటింగ్ చేస్తున్నంత కాలం ఒళ్లు హూన‌మైపోయింద‌ని ప్ర‌భాస్ ఎన్నో సంద‌ర్భాల్లో ఓపెన్ అయ్యారు. మ‌న‌సులో రానా ఫీలింగ్ కూడా అదే. కాక‌పోతే రానా వ్యాఖ్యానం అన్న‌ది కాస్త ప‌న్నీగా..సెటైరిక‌ల్ గా ఉంటుంది. రాజ‌మౌళితో సినిమా అంటే త్యాగం చేయాల్సిందే అంటారు. ఆ త‌ర్వాత అదే డైరెక్ట‌ర్ తో ప‌ని చేసిన రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీర్ కూడా త‌మ అనుభ‌వాల‌ను చెప్పుకొచ్చారు.

`ఆర్ ఆర్ ఆర్` కార‌ణంగా ఇద్ద‌ర్నీ ఎంత క‌ష్ట‌పెట్టారు అన్న‌ది ఓపెన్ గానే చెప్పేసారు. అయితే వీళ్లంద‌రికంటే ముందే రామ్ చ‌ర‌ణ్ `మ‌గ‌ధీర` కోసం రెక్క‌లు ముక్క‌లు చేసుకున్నాడు. కాక‌పోతే అప్పుడు సోష‌ల్ మీడియా అందుబాటులో లేదు కాబ‌ట్టి విష‌యం బ‌య‌ట‌కు రాలేదు. ఓపెన్ గా షేర్ చేసుకునే అవ‌కాశం కూడా రామ్ చ‌ర‌ణ్ లు లేక‌పోయింది. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ త‌ర్వాత త‌న క‌ష్టం ఎలా ఉంటుంద‌న్న‌ది బ‌హిర్గ‌త‌మైంది. సినిమాలు ప్రారంభా నికి ముందే ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ కూడా రాజ‌మౌళి హీరోలంతా తీసుకోవాల్సి ఉంటుంది. హీరో పాత్ర‌ను బ‌ట్టి ఎలాంటి ట్రైనింగ్ అవ‌స‌రం ప‌డితే? అందుకు త‌గ్గ‌ట్టు హీరో మౌల్డ్ అయి బాండ్ అయి నేర్చుకోవాల్సి ఉంటుంది.

మ‌రి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప‌రిస్థితి ఏంటి? అంటే? `వార‌ణాసి` కోసం అత‌డు అంతే క‌ష్ట‌ప‌డుతున్నాడు అన్న‌ది కాద‌న‌లేని నిజం. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో? సంచారి లుక్ బాడీ షేప్ ప‌రంగా చాలా మార్పులే చేసాడు. సిక్స్ ప్యాక్ ని సిద్దం చేసాడు. స్టైలిష్ లుక్ కోసం త‌దుప‌రి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మ‌హేష్ చొక్కా విప్పే అవ‌కాశం కూడా ఉంది. అత‌డి క‌ష్టం ఏ రేంజ్ లో ఉందన్న‌ది అప్పుడు మ‌రింత బ‌య‌డుతుంది. కానీ ఆన్ సెట్స్ లో మ‌హేష్ క‌ష్టం కూడా వ‌ర్ణానా తీతం అని ఆ మ‌ధ్య మ‌హేష్ మాట‌ల్లో క్లారిటీ వ‌చ్చేసింది. ప్రాజెక్ట్ ప్రారంభానికే ముందే మ‌హేష్ జ‌పాన్, ఆప్రికాలాంటి చోట అవ‌స‌రం మేర‌ స్పెష‌ల్ ట్రైనింగ్ లు తీసుకున్నాడు.

సెట్స్ కు వెళ్లిన త‌ర్వాత వాటిని అమ‌లుప‌రిచాడు. అందులోనూ జ‌క్క‌న్న కోరుకున్న విధంగా సీన్ ప‌ర్పెక్ష‌న్ రావాలి కాబ‌ట్టి! స్పాట్ లో రాజ‌మౌళి ముందు సీన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ విష‌యంలో రాజ‌మౌళి ఎంత మాత్రం రాజీప‌డ‌రు. 50 ఏళ్ల మ‌హేష్ ని కూడా క్ష‌మించ‌లేదు. సీన్స్ లో బెట‌ర్ ఇప్రూమెంట్ కోసం టేక్ ల మీద టేకులు చేస్తున్నారు. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, బ‌న్నీ లాంటి హీరోల వ‌య‌సు 45 లోపే. కానీ మ‌హేష్ వాళ్లంద‌రికంటే వ‌య‌సులో పెద్ద కావ‌డంతో? ఇంకాస్త ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌దు. అయినా ఆన్ సెట్స్ లో ఎన్ని టేక్ లు చేసినా? సంతృప్తి చెంద‌ని న‌టుడు మ‌హేష్‌. ది బెస్ట్ ఇవ్వ‌డం కోసం మహేష్ ఎంత మాత్రం రాజీ ప‌డ‌డు. అందులో డౌటే లేదు.

Tags:    

Similar News