• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'ఆచార్య'లో ఫుల్ లెంత్...

'ఆచార్య'లో ఫుల్ లెంత్ పవర్ ఫుల్ రోల్ లో చరణ్ : కొరటాల

By - Tupaki Desk
Update: 2020-12-14 14:30 GMT
మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఆచార్య'. ఇందులో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్లూ చరణ్ ఇందులో ప్రత్యేక పాత్రలో కనిపిస్తారని.. నిడివి చాలా తక్కువగా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా కొరటాల శివ ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ రోల్ పై క్లారిటీ ఇచ్చాడు. 'ఆచార్య' లో చరణ్ ఫుల్ లెంత్ రోల్ లో కనిపిస్తాడని.. అది కూడా ఓ పవర్ ఫుల్ పాత్ర అని.. చిరంజీవి - చరణ్ లను కలిపి డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని.. వారిని ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నానని కొరటాల చెప్పుకొచ్చాడు. దీంతో మెగాస్టార్ - మెగా పవర్ స్టార్ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ కోరిక తీరనుందని చెప్పవచ్చు.

కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ షూట్ కి కాస్త బ్రేక్ తీసుకుని 'ఆచార్య' సెట్స్ లో చెర్రీ అడుగుపెడతాడు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో చిరు కి జోడీగా కాజల్ కిచ్లు నటిస్తోంది. 'ఆచార్య'కు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. తిరు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.
Tags:    
  • Koratala Siva 
  • Acharya 
  • Chiranjeevi 
  • Ram Charan 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS