నాపై నాకే గౌరవం పెరిగింది-చరణ్

Update: 2018-03-19 07:15 GMT
‘రంగస్థలం’ తనకు జీవిత కాల అనుభవం అని.. ఈ సినిమా షూటింగ్ అయిపోయిందని తనకు చాలా బాధేస్తోందని.. ఈ చిత్రాన్ని.. సుకుమార్ ను చాలా చాలా మిస్సవుతానని అన్నాడు రామ్ చరణ్. ఈ చిత్రం తన కెరీర్లో ఒక మైలురాయి అని.. తన తండ్రికి ‘ఖైదీ’.. ‘స్వయం కృషి’.. ‘ఆపద్బాంధవుడు’ లాంటి సినిమాల మాదిరే తనకూ ఇది ప్రత్యేకమైన చిత్రమని.. దీన్ని ఒక సినిమాలా కాకుండా ఒక అనుభవం లాగా తాను భావిస్తానని చరణ్ చెప్పాడు. తన తల్లిదండ్రులతో పాటు అభిమానులు సైతం గర్వించే చిత్రం ‘రంగస్థలం’ అని చెప్పగలనని.. ఈ సినిమాలో చిట్టిబాబుగా తనకు తాను నచ్చేశానని.. తనపై తనకు చాలా గౌరవం పెరిగిందని.. ఇదంతా సుకుమార్ ఘనతే అని చరణ్ అన్నాడు.

ఈ సినిమాను దాదాపు ఏడాది తీశామని.. ఐతే కొన్నిసార్లు ఇంత లేటవుతోందేంటి.. సుకుమార్ ఇలా చేస్తున్నాడేంటి అనిపించినప్పటికీ.. చిట్టిబాబు పాత్రను.. ఈ సినిమాలో నటించడాన్ని చాలా ఆస్వాదించడం వల్ల తాను సుక్కుకు గట్టిగా ఈ విషయం చెప్పలేకపోయానని.. నిజానికి ఇంకా కొన్నాళ్లు ఈ సినిమాలోనే నటిస్తూ ఉండాలనిపించిందని.. లుంగీ.. గడ్డం లాంటి వాటిని ఇప్పుడు చాలా మిస్సవుతున్నానని.. రీషూట్లు అవసరమైతే మళ్లీ గడ్డం పెట్టుకుని వచ్చి నటించాలనిపిస్తోందని చరణ్ చెప్పడం విశేషం. ‘రంగస్థలం’ చేశాక మనం సిటీల్లో ఎందుకుంటున్నాం.. పల్లెల్లోనే బతకొచ్చు కదా అనిపించిందని.. తన జీవితంలో ఎప్పుడూ పల్లెటూరిలో జీవించే అవకాశం రాకపోయినా.. ఈ సినిమా ద్వారా ఆ అనుభూతిని పొందినందుకు సంతోషంగా ఉందని.. పల్లె జనాల స్ఫూర్తితోనే తన పాత్రను పోషించానని చరణ్ అన్నాడు.
Tags:    

Similar News