ఇంకెప్పుడూ నా పోస్టర్లపై నంబర్లుండవ్ -చరణ్

Update: 2018-05-24 14:53 GMT
రామ్ చరణ్ ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ గా కొత్త అవతారం ఎత్తాడు. ఓ మొబైల్ రిటైల్ చైన్ స్టోర్ కి ప్రచారం చేయనున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన రాగా.. ఇప్పుడు స్పెషల్ ఈవెంట్ నిర్వహించి మరీ.. ఈ మొబైల్ స్టోర్ లాంఛింగ్ ఈవెంట్ ను నిర్వహించారు.

మరి చరణ్ లాంటి పెద్ద స్టార్ హీరో ఇలా ఒక ఈవెంట్ లో కనిపిస్తే.. దానికి సంబంధించినవే అడగరు కదా జర్నలిస్టులు. సినిమా సక్సెస్ కు ఆ మూవీ వసూళ్లే కొలమానమా అనే ప్రశ్న ఎదురైంది. రంగస్థలం మూవీ 200 కోట్లు వసూళ్లు చేసిన సంగతి గుర్తు చేసి మరీ ఈ క్వశ్చన్ ను అడగడం గమనించాలి. దీనికి సమాధానం చెప్పడానికి రామ్ చరణ్ సుదీర్ఘంగానే సమాధానం చెప్పాల్సి వచ్చింది. 'అసలు ప్రయత్నం చేస్తేనే మంచిదా కాదా అని తెలుస్తుంది. నెంబర్స్ కు ఆడియన్స్ రియాక్ట్ కావడం నాకు అంతగా నచ్చలేదు. జనాల రియాక్షన్ ను బట్టి నిర్మాతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. అనవసరంగా జనాల్లో లేని ఫీలింగ్ ను మేమే తీసుకొస్తున్నామా లేదా అనిపిస్తోంది. మేము జెన్యూన్ గా అనుకున్నా అపార్ధం చేసుకునే ఛాన్స్ ఉంది' అన్నాడు చరణ్.

'మరెప్పుడూ నా సినిమా పోస్టర్లపై నెంబర్లను వేయద్దని నా నిర్మాతలను కోరతాను. ఎంతమంది ఆడియన్స్ థియేటర్లకు వచ్చారన్నదే లెక్క. పది మంది ఈ సినిమా చూసి బాగుందని అంటే వచ్చే సంతృప్తి ముందు ఈ నెంబర్లు శాటిస్ఫై చేయవు. అందరం ఫ్రెండ్స్ హెల్తీ కాంపిటీషన్ కోరుకుంటున్నా' అన్నాడు రామ్ చరణ్. ఇన్ డైరెక్టుగా.. రంగస్థలం- భరత్ అనే నేను మూవీలకు కలెక్షన్స్ నెంబర్ల విషయంలో ఆరోపణలు రావడంపైనే స్పందించాడు మెగా పవర్ స్టార్.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News