మెగాస్టార్ తర్వాత మెగా పవర్ స్టారేనట!
హిట్ల కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటారు ఫిలిం మేకర్స్. అలాంటి ఫిలిం ఇండస్ట్రీలో వరస బ్లాక్ బస్టర్లతో అదీ టాప్ లీగ్ స్టార్స్ తో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. కొరటాల శివ అలాంటి ఘనతే సాధించాడు. 100% సక్సెస్ రికార్డు ఉన్న డైరెక్టర్ ఆయన. మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో కొరటాల శివ సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. అంటే మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడన్నమాట.
తాజా సమాచారం ప్రకారం చరణ్ కొరటాలకు రెండు సినిమాలకోసం అడ్వాన్సు ఇచ్చాడట. చిరంజీవి - కొరటాల సినిమాకు చరణ్ కూడా ఒక నిర్మాత. ఈ సినిమా కాకుండా తన నెక్స్ట్ ఫిలిం కొరటాల శివ డైరెక్షన్లో చేస్తాడట. చరణ్-బోయపాటి సినిమా 'వినయ విధేయ రామ' సంక్రాంతి కి రిలీజ్ అవుతుంది. ఆ సినిమా విడుదలకు ముందే #RRR షూటింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది చివరికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత చరణ్-కొరటాల కాంబో సెట్స్ మీదకు వెళ్తుందట.
చరణ్-కొరటాల కాంబో పై ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఒకసారి సినిమా లాంచ్ అయ్యి కూడా ఆగిపోయింది. కానీ ఈసారి మాత్రం తప్పకుండా ఉంటుందట. ఈలెక్కన కొరటాలతో సినిమా చెయ్యాలని చూస్తున్న వేరే హీరోలు దాదాపు రెండేళ్ళ పాటు తమ ఆలోచనను పక్కనబెట్టాల్సిందే. ఇప్పటికే కొరటాల శివ కోసం ట్రై చేసిన వాళ్ళలో అల్లు అర్జున్.. అఖిల్ లాంటి వారు ఉన్నారట.